'వైయస్ఆర్' జివోల అంశం ఈనాడులో వచ్చింది: విహెచ్

ఇనుప ఖనిజం దోపిడీపై సుప్రీం కోర్టు దర్యాఫ్తునకు ఆదేశించినట్లే రాజధాని భూదోపిడీపై కూడా ఉన్నతస్థాయి విచారణ జరగాలన్నారు. ఖాళీగా ఉన్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేదల కోసం ఉపయోగించాలన్నారు. మద్యం సిండికేట్లపై ఎసిబి దాడులు జరిగినట్లే భూమాఫియాపై దర్యాఫ్తు జరగాలన్నారు. అవినీతిపై కాంగ్రెసు అధిష్టానం ఉక్కుపాదం మోపుతోందని ఆ బాటలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నడిచి భూదోపిడీకి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తన అనునయులకు అప్పనంగా కట్టబెట్టడానికి వైయస్సార్ ప్రయోగించిన జివోలపై పూర్తిస్థాయి విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. హౌస్ కమిటీకి విచారణ బాధ్యతలు అప్పగించాలన్నారు.












Click it and Unblock the Notifications