హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సభలో చంద్రబాబుకు మంత్రి మాణిక్య వరప్రసాద్ కౌంటర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu-Manikya Vara Prasad
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సభలో దళితుల గురించి మాట్లాడే సమయంలో మంత్రి మాణిక్య వర ప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. బుధవారం మధ్యాహ్నం బాబు అసెంబ్లీలో మాట్లాడుతూ దళితులకు టిడిపియే న్యాయం చేసిందని కాంగ్రెసు వారిని విస్మరించిందని అన్నారు. అందుకు మాణిక్య వర ప్రసాద్ కౌంటర్ వేశారు. బాబు చెప్పేవన్నీ అర్ధ సత్యాలేనన్నారు. టిడిపి దళితులకు ఆత్మశుద్ధితో చేయలేదని కానీ కాంగ్రెసు మాత్రం నెహ్రూ హయాం నుండి దళితులకు ఆత్మస్థైర్యం ఇచ్చే ప్రయత్నాలు చేస్తుందన్నారు. మధ్యలో బాబు ప్రసంగాన్ని కంక్లూడ్ చేయాలని స్పీకర్ సూచించారు. అందుకు బాబు ఇది అన్ లిమిటెడ్ అని తన ప్రసంగం సాయంత్రం వరకు కొనసాగుతుందని చెప్పారు. వ్యవసాయం అంటే ఏమిటో తెలియని రైతులను కూడా కాంగ్రెసు ప్రభుత్వం ఆదర్శ రైతులను చేసిందన్నారు. సైన్స్ సిటీ ఎత్తేశారన్నారు. వ్యవసాయానికి ప్రత్యేక కేటాయించాలని డిమాండ్ చేశారు.

రిపబ్లిక్ దినోత్సవం రోజు కూడా రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాలను ఈ ప్రభుత్వం కాపాడలేక పోయిందన్నారు. పలుచోట్ల విగ్రహాల ధ్వంసం జరిగిందన్నారు. టిడిపి హయాంలోనే దళితులకు న్యాయం జరిగిందన్నారు. భారతదేశంలో తొలిసారి బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత టిడిపిదేనన్నారు. చరిత్రను ఎవ్వరూ తుడపలేరన్నారు. కొన్ని రోజులు మభ్యపెట్టిస్తారేమో కానీ తుడపలేరన్నారు. మేం ఏం మాట్లాడాలో చెప్పే అర్హత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేదన్నారు. దళితులకు ఎక్కడా పదవులు ఇవ్వలేదన్నారు. చివరకు మమ్మల్ని కూడా డిప్యూటీ స్పీకర్ చేశారు తప్ప స్పీకర్ చేయలేదని మల్లు భట్టి విక్రమార్కను ఉద్దేశించి అన్నారు. ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌ను నియమించలేదన్నారు. పశుక్రాంతిని పశుభ్రాంతిగా మార్చారన్నారు. కాంగ్రెసు విధానాల వల్లనే చేనేత కార్మికుల ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. పన్నుల రూపంలో ప్రభుత్వం నిలువు దోపిడీ చేస్తుందన్నారు. హైదరాబాదులో మతకలహాలను తగ్గించింది టిడిపియేనన్నారు.

English summary
Minister Manikya Vara Prasad countered TDP chief Nara Chandrababu Naidu statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X