బాబు అమ్మితే ఫైట్ చేశారు!: టిడిపి నేతకు సిఎం కితాబు

Kiran Kumar Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం అసెంబ్లీలో కితాబు ఇచ్చారు. చిత్తురు జిల్లాలోని రెండు షుగర్ ఫ్యాక్టరీలను తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అమ్మేశారని ఆరోపించారు. అదృష్టవశాత్తూ ఆ తర్వాత కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కోర్టుకు వెళ్లి వెనక్కి తీసుకు వచ్చిందన్నారు. అదే జిల్లాకు చెందిన గాలి ముద్దు కృష్ణమ నాయుడు షుగర్ ఫ్యాక్టరీల కోసం బాగానే ఫైట్ చేశారన్నారు. జిల్లా అభివృద్ధి కోసం షుగర్ ఫ్యాక్టరీలు అక్కడకే రావాలని గాలి అమ్మకూడదని బాగా పట్టుబట్టారని అన్నారు. మంచి చేసిన వారు విపక్షంలో ఉన్నా తాను చెబుతానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

ముప్పయ్యేళ్ల తర్వాత చంద్రబాబుకు యువతరంగం ఎందుకు గుర్తుకు వచ్చిందో అని ఎద్దేవా చేశారు. మోటార్ సైకిల్ ఎక్కితే యువత బాబు వెంట వెళ్లదన్నారు. ప్రజా సంక్షేమం కోసం తాము అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అందులో భాగంగానే రాజీవ్ యువకిరణాలు పెట్టామన్నారు. బాబు కిరణాల పథకాన్ని విమర్శించడం సరికాదన్నారు. చంద్రబాబును బిల్ గేట్స్‌తో కలిపిన వ్యక్తి ప్రభుత్వ పథకాల సలహాదారుల్లో ఉన్నారన్నారు. యువకిరణాలు ప్రారంభోత్సవానికి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ రావాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల రాలేదన్నారు. ఆయన త్వరలో వస్తారన్నారు. ప్రజా సంక్షేమం కోసం వీలుంటే ప్రభుత్వానికి సాయం చేయండి లేదంటే గమ్మున కూర్చోండని బాబుకు సిఎం సూచించారు. బాబుకు ఇష్టమైన వరల్డ్ బ్యాంక్ కూడా ఆంధ్ర ప్రదేశ్ పెట్టుబడులకు అనుకూలమైనదని కితాబు ఇచ్చిందన్నారు. మహిళలకు ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేపడుతుందన్నారు. కేవలం చిత్తూరు జిల్లాలోనే లక్ష ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. అన్ని రంగాల్లో ఖాళీలు భర్తీ చేస్తున్నామన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం 72 లక్షల మందికి పింఛన్లు ఇస్తుందన్నారు. యువత కాంగ్రెసు వైపు చూస్తోందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+