సభకు బొత్స హాజరు: మైక్ కట్ చేసి షాకిచ్చిన స్పీకర్

Botsa Satyanarayana
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ఎట్టకేలకు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఇటీవల న్యూఢిల్లీ వెళ్లిన బొత్స ఆ తర్వాత శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ వచ్చారు. అప్పుడు మద్యం సిండికేట్లపై వాడిగా వేడిగా చర్చ జరుగుతుండగా ఆయన మాత్రం సమావేశాలకు హాజరు కాలేదు. శుక్రవారం మధ్యాహ్నమే నేరుగా అసెంబ్లీకి వచ్చినప్పటికీ ఆయన తన చాంబరుకే పరిమితమయ్యారు. సోమవారం కూడా తెలుగుదేశం పార్టీ మద్యం సిండికేట్లపై చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టింది. ఆ రోజు కూడా బొత్స సమావేశాలకు గైర్హాజరయ్యారు. సమావేశాలు గందరగోళంగా జరుగుతున్నందు వల్లే తాను సభకు హాజరు కావడం లేదని బొత్స చెప్పారు. అయితే తెలుగుదేశం మాత్రం మద్యం సిండికేట్ల అంశంపై సమాధానం చెప్పలేకే బొత్స తప్పించుకు తిరిగారని ఆరోపించింది.

మంగళవారం బొత్స సమావేశాలకు హాజరయ్యారు. రైతుల సమస్యలు, పంట విరామంపై సుదీర్ఘ చర్చ జరిగింది. రైతు సమస్యలపై తెలుగుదేశం, లోక్ సత్తా పార్టీలు లేవనెత్తిన అంశంపై ఓ సమయంలో బొత్స కల్పించుకునే ప్రయత్నం చేసి భంగపడ్డారు. ఆయన ప్రసంగించేందుకు లేవగానే విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. దీంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ బొత్స మైక్ కట్ చేశారు. దీంతో బొత్స ఖంగు తిన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+