గాలి హెలికాప్టర్, కార్ల పిటిషన్‌పై విచారణ వాయిదా

అక్రమ గనుల తవ్వకాల ద్వారా సంపాదించిన సొమ్ముతోనే వారు ఈ వాహనాలను కొనుగోలు చేశారని సిబిఐ వాదించింది. హెలికాప్టర్‌ను, ఖరీదైన కార్లను వారికి అప్పగిస్తే విక్రయించే అవకాశం ఉందని అంటూ అందువల్ల వాటిని తిరిగి వారికి ఇవ్వకూడదని సిబిఐ కోరింది.
కాగా, ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో అరెస్టయిన విజయ రాఘవన్ బెయిల్ పిటిషన్‌పై విచారణను సిబిఐ ప్రత్యేక కోర్టు విచారణను రేపటికి (బుధవారంనాటికి) వాయిదా వేసింది. విజయరాఘవన్‌కు బెయిల్ ఇవ్వకూడదని సిబిఐ కోరింది. కేసు దర్యాప్తులో ఉన్నందున విజయరాఘవన్‌కు బెయిల్ ఇవ్వకూడదని వాదించింది. విజయరాఘవన్ పిటిషన్‌పై రేపు కౌంటర్ దాఖలు చేస్తామని సిబిఐ తెలిపింది. విచారణ సందర్భంగా నిందితుడు విజయరాఘవన్‌ను కోర్టులో హాజరు పరచాలని కోర్టు జైలు అధికారులను ఆదేశించింది.












Click it and Unblock the Notifications