సభ వాయిదా, అసెంబ్లీలో కిరణ్ రెడ్డితో బొత్స సత్తిబాబు

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన భూకేటాయింపులపై అసెంబ్లీలో చర్చ జరగాలని టిడిపి నేతలు పట్టుబట్టారు. కుంభకోణం వెనుక ఉన్న బడాబాబుల పేర్లు బయటకు రావాలని అన్నారు. దీనిపై సభలో చర్చిద్దామంటే స్పీకర్ తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని టిడిపి విమర్శించింది. కాగా సభ వాయిదా పడిన అనంతరం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications