జనాల్ని చూస్తే గెలుస్తామనిపిస్తోంది: తేల్చేసిన బొత్స

Botsa Satyanarayana
హైదరాబాద్: నామినేషన్ సందర్భంలో వచ్చిన జనాన్ని చూస్తుంటే కాంగ్రెసు పార్టీ గెలుపు ఖాయమనిపిస్తుందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గురువారం అన్నారు. తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెసు పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేసిన అన్ని చోట్ల ప్రజల నుండి మంచి స్పందన కనిపించిందన్నారు. విజయావకాశాలు మాకే ఉన్నాయని ఆయన చెప్పారు. రాష్ట్ర నేతలు అందరూ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు. తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి, పిసిసి మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ తదితర నేతలంతా ప్రచారంలో పాల్గొంటారన్నారు. రాజ్యసభ సీట్ల విషయంలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. రాష్ట్రం నుండి పోటీ పడుతున్న వారి పేర్లు అధిష్టానానికి పంపిస్తామని చెప్పారు.

కాంగ్రెసు పార్టీతోనే తెలంగాణ సాధ్యమని మాజీ మంత్రి షబ్బీర్ అలీ వేరుగా అన్నారు. ప్రత్యేక తెలంగాణ, రాష్ట్ర అభివృద్ధియే ఉప ఎన్నికల్లో మా నినాదం అని ఆయన చెప్పారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో పెట్టాలంటే కాంగ్రెసు పార్టీని గెలిపించాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన అన్నారు. ఓట్లు, నోట్ల కోసమే కెసిఆర్ రాజకీయాలు అన్నారు. పార్టీ ఏర్పడినప్పటి నుండి ఉప ఎన్నికలే తప్ప ఒరిగిందేమీ లేదన్నారు. టిఆర్ఎస్ భవనం వ్యాపారాలకు వాడుకోవద్దన్నారు. టిఆర్ఎస్ భవనం పేపర్, ఛానల్ నడుపుతోందన్నారు. తెలంగాణ సెంటిమెంట్ పేరుతో కెసిఆర్ ప్రజలకు లబ్ధి చేకూర్చిందేమీ లేదని వారి కుటుంబమే లాభపడిందన్నారు. కాగా బొత్స, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉప ఎన్నికలు జరగబోయే పలు నియోజకవర్గాల నేతలతో గురువారం భేటీ అయ్యారు. అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+