పట్టించుకోవట్లేదు: కాంగ్రెస్ తీరుపై చిరు మంత్రి అసంతృప్తి

దీంతో విలీన ప్రక్రియకే అర్థం లేకుండా పోయిందన్నారు. ఎందుకు విలీనమయ్యామా అని కేడర్ అయోమయంలో పడిందన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం చేసిన సూచనలను రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తుంగలో తొక్కుతున్నారన్నారు. పదవులు ఎందుకు తీసుకున్నామా? అన్న బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పిఆర్పీ కేడర్‌ను కాంగ్రెసు ఉపయోగించుకోవడం లేదన్నారు. పిఆర్పీ కేడర్‌కు విపక్షాలు గాలం వేస్తున్నాయన్నారు. తమకు సముచిత స్థానం కల్పించాలన్నారు. నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని అన్నారు. తమ పార్టీ నాయకుల అసంతృప్తిని కాంగ్రెసు గమనించాలన్నారు.
అయితే, ఆ తర్వాత ఇదే అంశంపై ఇతర చానళ్లతో మాట్లాడడానికి ఆయన నిరాకరించారు. ఏదో ఫ్లోలో మాట్లాడేశాను తప్ప ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్‌ను విమర్శించ లేదని చెప్పడం గమనార్హం. నిజంగా అలా మాట్లాడాలని ఉంటే మీడియా ప్రతినిధులందరినీ పిలిచి మాట్లాడి ఉండే వాడినన్నారు. దీనికి సంబంధించిన వివరణను కూడా ఇక్కడ ఇవ్వనని, హైదరాబాద్‌లోనే మాట్లాడతానని చెప్పారు. ఆ తర్వాత ఆయన మీడియాకు అందుబాటులో లేకుండా వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications