వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు బొత్స సవాల్, మాతోనే వైయస్ నేత అయ్యారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన ఏ పథకం ఇప్పుడు రాష్ట్రంలో అమలు కావడం లేదో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చూపించాలని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం సవాల్ చేశారు. ఆయన గాంధీ భవనంలో ఎన్ఎస్‌యుఐ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఎవరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉప ఎన్నికలు జరుగుతున్నాయో గుర్తించాలన్నారు. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసమే ఉప ఎన్నికలు వచ్చాయని అందరికీ తెలుసునన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలను కాంగ్రెసు ప్రభుత్వం అమలు చేయడం లేదని జగన్ కల్లిబొల్లి మాటలు చెబుతున్నారని విమర్శించారు. ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

2004 నుంచి అమలవుతున్న ఏ ఒక్క పథకాన్ని కూడా కాంగ్రెసు విస్మరించలేదన్నారు. అభివృద్ధి, సంక్షేమం, జగన్ అవినీతే మా ప్రచారం అజెండా అన్నారు. స్వప్రయోజనాల కోసం ఉప ఎన్నికలు తీసుకు వచ్చిన వారిని ఎండగడతామన్నారు. అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడే నైతిక హక్కు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు లేదన్నారు.

చంద్రబాబు తెలియకుండా మాట్లాడితే ఎలా అన్నారు. తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. దోచుకున్న చంద్రబాబు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ముగ్గురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మద్యం వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. విజయనగరం జిల్లాకు చెందిన టిడిపి ఎమ్మెల్యే భర్త మఠా నాయకుడు అని విమర్శించారు.

కెబినెట్ నిర్ణయాలకు మేమూ బాధ్యులమేనని, అయితే తెరవెనుక జరిగే లావాదేవీలకు తాము బాధ్యులం కామని చెప్పారు. తనలాంటి ఎందరో కలిస్తే వైయస్ నేత అయ్యారన్నారు. అందరి సహకారం వల్లే ఆయన నేత అయ్యాడని గుర్తుంచుకోవాలన్నారు. వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడైనా కూర్చోవచ్చునని పరోక్షంగా జగన్‌ను ఉద్దేశించి అన్నారు. కాగా బొత్స సత్యనారాయణ ఆదివారం నుండి ఉప ఎన్నికల ప్రచారం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఉప ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆయన చెప్పారు.

English summary
Pradesh Congress Committee president, Transport Minister Botsa Satyanarayana challenged YSR Congress Party chief YS Jaganmohan Reddy on government schemes. He fired at Telugudesam Party chief Nara Chandrababu Naidu and YS Jaganmohan Reddy in his press meet on monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X