మళ్లీ జగన్ సెక్యూరిటీ ఓవరాక్షన్, స్థానికులపై వీరంగం

అక్కడకు వైయస్ జగన్ రావడంతో ఆయనను చూసేందుకు అక్కడకు భారీగా జనాలు తరలి వచ్చారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు చుట్టు పక్కల నుండి వచ్చారు. అయితే జగన్ సెక్యూరిటీ మాత్రం వారి పట్ల కఠినంగా వ్యవహరించింది. జగన్‌ను చూసేందుకు వచ్చిన వారిపై ఓవరాక్షన్ చేసింది. అభిమానులపై చేయి చేసుకున్నారు.
మతిస్థిమితం లేని ఓ బాలుడిపై కూడా చేయి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. జగన్‌ను చూసేందుకు వచ్చిన వారిని స్థానిక సిఐ, డిఎస్పీ కూడా ఈడ్చి పడేశారట. తోపులాట జరిగింది. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మరోవైపు జగన్ అభిమానులు కూడా కాస్త హంగామా చేశారు. బాధితులను జగన్ పరామర్శించేందుకు వెళితే.. వీరు మాత్రం జగన్ జిందాబాద్, జగన్‌కు జై అంటూ అంటూ హడావుడి చేశారు.
కాగా ఇటీవల సీమాంధ్రలో జగన్ పర్యటిస్తున్న సమయంలో కూడా సెక్యూరిటీ సిబ్బంది అభిమానులు, చూసేందుకు వచ్చిన వారిపై పిడిగుద్దులు కురిపించిన విషయం తెలిసిందే. జగన్ మాట్లాడుతుండగా ఓ జర్నలిస్టును సెక్యూరిటీ సిబ్బంది వేదిక పై నుండి గెంటి వేశారు. ఈ ఘటనలో జర్నలిస్టుతో పాటు పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే జగన్ మాత్రం సెక్యూరిటీని వారించారు.












Click it and Unblock the Notifications