వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సబితా ఇంద్రా రెడ్డి, సిబిఐని టార్గెట్ చేసిన శ్రీలక్ష్మి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy - Srilaxmi
హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కేసులో హడావుడిగా ఒకే రోజు జివోలు జారీ చేయడంలో తాను చేసింది తప్పయితే అదే రోజు సంతకం చేసిన అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డిదీ తప్పేనని శ్రీలక్ష్మీ అన్నారు. సిబిఐ దృష్టిలో మంత్రి చేస్తే తప్పు కదాని, తాను చేస్తేనే తప్పువుతుందంటున్నారని తెలిపింది. సంతకం చేసే ముందు మంత్రికి ఏవైనా అనుమానాలుంటే వివరణ ఇవ్వడానికి సిబ్బంది ఉన్నారని, అయితే ఆమె అలాంటిదేమీ చేయలేదని చెప్పారు. కేబినెట్ ఆమోదించాకే జివోలు జారీ అయ్యాయని, కాని ఎవరికీ అనుకూలంగా వారు వాంగ్మూలాలు ఇచ్చారని అన్నారు.

సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి బెయిల్ పిటిషన్‌పై సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో శనివారం సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఆమె తరఫున సురేంద్ర రావు వాదనలు వినిపించారు. ఓఎంసీకి లీజులు మంజూరు చేసేందుకు ఒకే రోజు రెండు జీవోలపై సంతకాలు చేసినట్లు ఆరోపించారు. నిజానికి... ఎపిఎండిసి పరిధిలోని 25 హెకార్లు ఓఎంసికి దక్కకుండా తానే అడ్డుకున్నానన్నారు. వాటిలో మైనింగ్ జరగనందున వాటినీ తమకే కేటాయించాలని ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి ఓఎంసి లేఖ రాసిందని, ఆ లేఖను సిఎంవో ద్వారా నాకు పంపారని తెలిపింది.

ఈ ప్రతిపాదనకు తాను ఒప్పుకోలేదన్నారు. ఫైల్‌ను మంత్రికి పంపలేదన్నారు. ఒకవేళ ఆ ఫైల్‌ను పంపి ఉంటే వైయస్‌కు మంత్రి సన్నిహితమైనందున దాన్ని ఆమోదించేవారన్నారు. ఓఎంసికి లీజుల కేటాయింపులో తన పాత్ర పరిమితమని శ్రీలక్ష్మి తెలిపారు. లీజులు కేటాయింపులపై కేబినెట్ సమష్టిగా నిర్ణయం తీసుకుంటుందని కానీ, తనను మాత్రమే తప్పు పట్టడమేమిటని నిలదీశారు. గనుల వ్యాపారి శశి కుమార్ ఎప్పుడూ సిబిఐ కార్యాలయంలోనే కనిపిస్తారని, ఆయన మాటలకు విలువ ఎలా ఇస్తారు? సిబిఐ కావాలనే ఈ కేసును మసిపూసి మారేడు కాయ చేస్తోందని విమర్శించారు.

మొదటి చార్జ్‌షీట్‌లో సాక్షులుగా చూపిన వారినే సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌లోనూ చూపిందన్నారు. వారిచ్చిన వాంగ్మూలాలకు కొంత అదనపు సమాచారం జోడించిందన్నారు. మైనింగ్ లీజుల కేటాయింపు అంతా కేంద్ర నిర్ణయంపైనే జరుగుతుందని, ఇందులో రాష్ట్రం పాత్ర తక్కువని శ్రీలక్ష్మి లాయర్ పేర్కొన్నారు. లీజుల కోసం దరఖాస్తు చేసిన ఇతర కంపెనీల వివరణలు కోరకుండానే, తగిన సమయం ఇవ్వకుండానే తిరస్కరించారనే ఆరోపణలు సరికాదన్నారు.

సాక్ష్యాలను తారుమారుచేస్తారనే అనుమానం ఉంటే... శ్రీలక్ష్మి హైదరాబాద్ వెలుపల ఉండేందుకు కూడా సిద్ధమని, ఆమెకు బెయిల్ ఇవ్వాలని కోరారు. కాగా శ్రీలక్ష్మి తరఫు వాదనలను సిబిఐ లాయర్ రవీంద్రనాథ్ బలంగా తిప్పికొట్టారు. జీవోల కోసం జనం సెక్రటేరియట్ చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతుంటారన్నారు. కానీ... ఓఎంసికి లబ్ధి చేకూర్చేందుకు శ్రీలక్ష్మి రెండు జీవోలను ఒకేరోజు జారీ చేశారన్నారు. దీని ద్వారా ఆమెకు ఏమైనా ప్రయోజనం చేకూరిందా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు.

అలాగే ఆమె మరిది ఆస్తుల పైనా, గాలి పీఏ అలీ ఖాన్‌కు తెలిసిన విషయాలు రాబట్టడంపై సిబిఐ దృష్టి పెట్టిందని అన్నారు. ఉన్నత స్థానాల్లో ఉన్న శ్రీలక్ష్మి దంపతులు కేసును ప్రభావితం చేయొచ్చని... ఈ దశలో ఆమెకు బెయిల్ ఇవ్వడం సరికాదని కోర్టుకు నివేదించారు. ఈ కేసులో వాదోపవాదాలు పూర్తి అయ్యాయి. బెయిల్‌పై ఈనెల 11న కోర్టు నిర్ణయం వెలువడనుంది.

English summary
Senior IAS officer Y Srilakshmi, an accused in the 
 
 illegal mining case, on Saturday charged CBI with 
 
 selectively targeting her and protecting the then 
 
 minister of mines, Sabita Indra Reddy. Srilakshmi's 
 
 counsel, V Surendar Rao, made this submission before a 
 
 CBI court where he was seeking bail for his client.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X