రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత..? పౌరసరఫరాల శాఖ క్లారిటీ
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ దేశాలతో పాటు భారత్ లోనూ చమురు, గ్యాస్ సరఫరాలో కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా చమురు, గ్యాస్ కొరత ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ పెట్రోల్, డీజిల్ కొరత ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో పలు కథనాలు వెలువడుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని పలు పెట్రోల్ బంకులు ఖాళీగా దర్శనమిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్సరఫరాకు నిల్వలు సమృద్దిగా ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు కీలకంగా మారిన హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన విషయం తెలిసిందే. అయితే హార్మూజ్ జలసంధి మూసివేత కారణంగా ప్రపంచదేశాలతోపాటు భారత్ లోనూ చమురు, గ్యాస్ కొరత ఏర్పడిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ సరఫరాకు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఓ ప్రకటన చేసింది.

ఈ క్రమంలో వినియోగదారులు ఎటువంటి అపోహలు, ఆందోళనకు గురి కావద్దని రాష్ట్ర ప్రభుత్వం సూచనలు చేసింది. ఎవరు కూడా తొందర పడి బ్లాక్ మార్కెట్లో విక్రయాలు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ప్రతి రోజు 9,574 కిలోలీటర్ల పెట్రోల్ అలాగే 14,457 కిలో లీటర్ల డీజిల్ ఇలా మొత్తం 24 వేల కిలో లీటర్లపైగా పెట్రోల్, డీజిల్ ను బంకుల ద్వారా వాహనదారులకు అమ్మకాలు జరుపుతున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నివేదించింది. దాంతోపాటు వంట గ్యాస్ వినియోగదారులకు 2.22 లక్షలకు పైగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్నట్లు స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications