చిరంజీవి కూతురింట్లో రూ.35 కోట్లు: ఐటి శాఖ

దస్తావేజులకు, నగదుకు సంబంధించి సరైన సమాధానం రాలేదని ప్రకటించిన ఐటి శాఖ మరిన్ని దాడులు నిర్వహిస్తామని తెలిపింది. ఆదాయానికి సంబంధించి సరైన వివరాలు అందించలేదనే ఆరోపణలతో ఐటి అధికారులు ఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఐటి శాఖ అధికారులు తొలుత చిరంజీవి వియ్యంకుడికి వియ్యంకుడి నివాసంలో సోదాలు నిర్వహించారు. ఆ తర్వాత చిరంజీవి వియ్యంకుడి నివాసంలో సోదాలు నిర్వహించారు.
చిరంజీవి కూతురు సుస్మిత ఇంట్లో సోదాలపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిచ్చు పుట్టింది. సుస్మిత నివాసంలో లభించిన సొమ్ము చిరంజీవికి సంబంధించిందని, దాన్ని ఉప ఎన్నికల్లో ఖర్చుకు నిర్దేశించారని అనుమానాలు వ్యక్తం చేస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు చెందిన సాక్షి టీవీ ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. ఐటి శాఖ దాడుల నుంచి బయటపడడానికి చిరంజీవి నేరుగా చెన్నై నుంచి ఢిల్లీ వెళ్లారని సాక్షి టీవీ వ్యాఖ్యానించింది.
సాక్షి టీవీ వార్తాకథనంపై అదే రోజు చిరంజీవి భగ్గుమన్నారు. తన వ్యక్తిత్వహననానికి సాక్షి టీవీ తప్పుడు వార్తాకథనాన్ని ప్రసారం చేసిందని ఆయన ఆరోపించారు. వైయస్ జగన్‌పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై చానెల్ అసత్య ప్రచారం సాగిస్తోందని, ప్రజలకు అపోహలు కలిగిస్తోందని, ఆ వార్తాకథనానికి టీవీ చానెల్ సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. తిరుపతిలో ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత తాను చెన్నై వెళ్లానని, ఈ ఉదయమే తాను హైదరాబాదుకు వచ్చానని ఆయన చెప్పారు.
వాస్తవాలను దాచి పెట్టి తాను తన కూతురింటికి వెళ్లినట్లు, ఐటి అధికారులు సొమ్ము పట్టుకోవడంతో తాను ఢిల్లీకి వెళ్లినట్లు టీవీ చానెల్ వార్తాకథనాన్ని ప్రసారం చేసిందని ఆయన అన్నారు. తాను ఢిల్లీ వెళ్లలేదని, కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలుసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications