మళ్లీ రేపు రండి!: పెట్టుబడులపై జగన్‌నుండి సిబిఐ ఆరా

లంచ్ సమయం వరకు డిఐజి వెంకటేష్ జగన్‌ను విచారించగా, లంచ్ అనంతరం సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ విచారించారని తెలుస్తోంది. సిబిఐ ప్రశ్నావళికి జగన్ ఉక్కిరి బిక్కిరయ్యారని అంటున్నారు. జగన్ నుండి సిబిఐ అధికారులు కీలక సమాచారం రాబట్టినట్లుగా తెలుస్తోంది. జగన్‌ను అధికారులు బ్రేక్ చేసేందుకు ప్రయత్నాలు చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. సిబిఐ అరెస్టుకు ముందు జగన్‌ను మూడు రోజుల పాటు విచారించిన విషయం తెలిసిందే.
అప్పటి విచారణకు, ఇప్పటి విచారణకు తేడా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. అరెస్టుకు ముందు జగన్‌ను మర్యాదపూర్వకంగా విచారించిన సిబిఐ అధికారులు, ఈ రోజు మాత్రం బ్రేక్ చేసే ప్రయత్నాలు చేశారని అంటున్నారు. గత విచారణ సమయంలో జగన్ ఏమాత్రం సహకరించలేదని సిబిఐ కోర్టులో తెలిపింది. మరి ఇప్పుడు సహకరించాడా లేదా అనేది తేలనుంది. జగతి పబ్లికేషన్స్‌లోకి హవాలా ద్వారా వచ్చిన సొమ్ముపై అధికారులు ఆరా తీసినట్లుగా తెలుస్తోంది.
జగన్ కంపెనీలలోకి వచ్చిన మిగతా పెట్టుబడులపై కూడా ఆరా తీశారని తెలుస్తోంది. మారిషస్‌కు చెందిన 2ఐ క్యాపిటల్, ఫ్లూరీ ఎమర్జింగ్ పెట్టుబడులు పెట్టాయి. మారిషస్‌తో పాటు మరో నాలుగు కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టాయి. కేవలం మారిషస్ కంపెనీలో రూ.124 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటిపై పూర్తిగా విచారించినట్లు తెలుస్తోంది. ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో అధికారులు జగన్‌ను విచారించారు. జగన్ ఒక్కడినే విచారించారని తెలుస్తోంది. సిబిఐ జగన్‌ను మరో నాలుగు రోజుల పాటు విచారించనుంది.












Click it and Unblock the Notifications