విజయమ్మను, షర్మిలను చూస్తుంటే జాలేస్తుంది: బొత్స

ప్రజల సానుభూతి కోసం షర్మిల, విజయమ్మలు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే జాలేస్తుందన్నారు. తప్పు చేస్తే ఎంతటి వారికైనా కాంగ్రెసు పార్టీలో శిక్ష ఉంటుందన్నారు. పార్టీలో ఉన్నంత మాత్రాన తప్పులను కప్పి పుచ్చే సంస్కృతి తమకు లేదన్నారు. జగన్ కాంగ్రెసు పార్టీలో ఉన్నా సిబిఐ విచారణ జరిగి ఉండేదన్నారు. కాంగ్రెసులో న్యాయం న్యాయమే ఉంటుందన్నరు. తప్పు చేస్తే శిక్ష తప్పదన్నారు. తప్పు చేస్తే ముఖ్యమంత్రి అయినా చర్యలు తప్పవన్నారు. పార్టీలో అనుభవం ప్రకారమే పదవులు వస్తున్నాయన్నారు.
విజయమ్మ, షర్మిలలు ఆవాస్తవాలు మాట్లాడుతూ ప్రజల సానుభూతి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. రాజసౌధాలుకట్టుకున్న వారు సామాజిక సేవ ఎలా చేస్తారని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని చంపుకోవాల్సిన అవసరం తమకు ఏమాత్రం లేదన్నారు. అబద్దాలను నిజాలుగా ప్రచారం చేయాలని వారు చూస్తున్నారని, అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు. వోక్స్ వ్యాగన్ కేసులో ప్రభుత్వం డబ్బును రికవరీ చేసిందన్నారు.
వోక్స్ వ్యాగన్ కేసులో తనను ఎందుకు అరెస్టు చేయలేదని విజయమ్మ ప్రశ్నిస్తున్నారని... వారిలా తాను లంచాలు తీసుకోలేదన్నారు. జగన్‌కు జిందాబాదులు కొట్టాల్సిన అవసరం తమకు ఏమాత్రం లేదన్నారు. అవినీతిపై పోరాటంలో కాంగ్రెసు వెనుకంజ వేయదన్నారు. ధనదాహంతో వారు ఇష్టం వచ్చినట్లుగా ప్రచారం చేస్తున్నారన్నారు. తాను తప్పు చేస్తే ప్రజల్నే క్షమాపణ కోరతానన్నారు. విజయమ్మలా తప్పు బుకాయించే చరిత్ర తనది కాదన్నారు. ఉప ఎన్నికలలో కాంగ్రెసుకు మంచి ఫలితాలు ఉంటాయన్నారు.
వైయస్ చనిపోయిన రోజునే జగన్ సంతకాలు చేయించారని, అందుకే మృతిపై అనుమానాలు వ్యక్తం చేశానని అన్నారు. నాటి ఏవియేషన్ అధికారి బ్రహ్మానంద రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి తానే లేఖ రాశానని చెప్పారు. ఎంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెసు వీడినా భయం లేదని, ప్రభుత్వాన్ని ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసు అన్నారు. మాది దొంగల పార్టీ అయితే టిడిపి రుషుల పార్టీయా అని ప్రశ్నించారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకు న్యాయస్థానాల నుండి స్టే వచ్చిందేమో కానీ ప్రజల నుండి ఇంకా స్టే రాలేదన్నారు.
విచారణకు హాజరు కావాలన్నంత మాత్రాన మంత్రులు దోషులు కాదని మంత్రి గల్లా అరుణ కుమారి చిత్తూరు జిల్లాలో అన్నారు. ఆరోపణలు వచ్చినప్పుడు చట్టం తన పని తాను చేసుకు పోతోందన్నారు. చట్టానికి అందరూ సహకరించాల్సిందేనని చెప్పారు. ముఖ్యమంత్రి పదవి కోసం జగన్ అడ్డదారులు తొక్కారని రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో అన్నారు. చిరంజీవి రాకతో కాంగ్రెసుదే గెలుపు అని అర్థమయిపోయిందని గులాం నబీ ఆజాద్ అన్నారు.












Click it and Unblock the Notifications