నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దొరికాడు:జగన్‌పై లగడపాటి, అవార్డివ్వాలా..పురంధేశ్వరి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal - Purandheswari
నెల్లూరు/చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పక్కా ఆధారాలతో దొరికిపోయాడని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మంగళవారం అన్నారు. ఆయన చిత్తూరు జిల్లా తిరుపతి నియోజకవర్గంలో కాంగ్రెసు అభ్యర్థి వెంకటరమణ తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదన్నారు.

తండ్రి పేరును బజారునకీడుస్తున్నది జగనే అన్నారు. జగన్ ఆస్తుల కేసులో విచారణ వేగవంతంగా జరిగితే శిక్ష తప్పదన్నారు. జగన్ శాశ్వతంగా జైల్లోనే ఉంటారన్నారు. ప్రచారం ముమ్మరంగా చేస్తున్నామని, వెంకటరమణ గెలుపు ఖాయమన్నారు. వెంకటరమణ 2004లో నలభై వేల ఓట్లతో గెలిచారని, 2009లో టిక్కెట్ ఇవ్వలేదని, ఆ సానుభూతి ప్రజల్లో ఉందన్నారు. మేం తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల్లా అవాస్తవాలు చెప్పడం లేదన్నారు.

చేయబోయేది చెబుతున్నామని, చేసేదే చెబుతున్నామని అన్నారు. అసత్యాలు ప్రచారం చేయడం లేదన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమ ప్రచార అస్త్రాలు అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సెంటిమెంటును నమ్ముకుందని, అది పని చేయదన్నారు. విజయమ్మకు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మృతిపై అనుమానాలు మూడేళ్ల తర్వాత గుర్తుకు వచ్చాయా అన్నారు. బిఫారం తీసుకున్నప్పుడు ఎందుకు అడగలేదన్నారు.

కొడుకు మూటలు తెచ్చినప్పుడు ఎందుకు అడగలేదన్నారు. వాస్తవాలు అన్నీ ప్రజలకు తెలుసునని, ధర్మానికి అధర్మానికి, నమ్ముకున్నవాడికి అమ్ముకున్న వాడికి, పెట్టేవాడికి, కొట్టేవాడికి మధ్య జరుగుతున్న ఎన్నికలన్నారు. న్యాయవ్యవస్థనే ప్రభావితం చేసిన వారు రాజకీయ నేతలను కొనడం ఓ లెక్కా అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చట్టం ముందు అందరూ సమానులేనని, జగన్‌కు కఠిన శిక్ష తప్పదన్నారు.

ప్రజలు ఎలాంటి వ్యక్తిని బలపరుస్తున్నారో అర్థం చేసుకొని ఓటేయాలని కేంద్ర సహాయ మంత్రి పురంధేశ్వరి నెల్లూరులో అన్నారు. జగన్ చరిత్ర తెలుసుకోవాలని సూచించారు. జగన్‌కు ఓటేస్తే ప్రమాదం అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి కృతజ్ఞతగా జగన్‌కు ఓటేస్తే ప్రమాదమన్నారు. జగన్ ఓ జాతీయ ఛానల్‌తో గతంలో మాట్లాడుతూ తనకు జాతీయ అవార్డు ఇవ్వాలని అన్నారని, ఆయనకు అవార్డు ఎందుకివ్వాలన్నారు.

ప్రజలను రోడ్ల పైకి ఈడ్చినందుకు జాతీయ అవార్డు ఇవ్వాలా అని ప్రశ్నించారు. విగ్రహాలు ప్రతిష్టిస్తే అది కేవలం విగ్రహ పూజ మాత్రమే అవుతుందని, కానీ వారి దారిలో నడిస్తేనే నిజమైన నివాళి అవుతుందన్నారు. టి.సుబ్బిరామి రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు.

English summary
Congress MP Lagadapati Rajagopal and central minister Purandheshwari blamed YSR Congress Party chief and Kadapa MP YS Jaganmohan Reddy on Tuesday in their bypolls campaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X