మరో ట్రై వ్యాలీ: వీసా ఫ్రాడ్‌తో 8 మంది అరెస్టు

నిరుడు ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయం నిర్వాకం వల్ల అధికశాతం భారత విద్యార్థులు బాధితులుగా మారిన సంగతి తెలిసిందే. తాజా ఉదంతంలోనూ ఇదే పరిస్థితి పునరావృతమైంది. అరెస్టయిన మోసగాళ్లలో రెండు సంస్థల అధ్యక్షులు మనమదురై సోమలింగం, ధీరేన్‌కుమార్ పరిఖ్‌తోపాటు వనరాజ్‌సింగ్ చావ్డా, మాలిక్ గజ్జర్, హేమలత క్రిస్టియన్, యాస్మిన్ రివెరా భారతీయులే కావడం విశేషం.
వారికి అమెరికన్లు మైకేల్ అల్ఫోన్సో, టిఫానీ థామస్ సహకరించారు. ఇతర వర్సిటీల్లో చదువు కొనసాగించడం లేదా స్వదేశం వెళ్లడంపై నిర్ణయాన్ని అమెరికా ప్రభుత్వం విద్యార్థులకే వదిలేసింది. ఏహెచ్‌టీఐలోని 200 మంది విదేశీ విద్యార్థులలో ఎక్కువమంది భారతీయులే. ఆ సంస్థ వెబ్‌సైట్‌లో పేర్కొన్న మేరకు న్యూజెర్సీ రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో 15 ఏళ్ల కిందట ఈ సంస్థ ప్రారంభమైంది.
వలసకు వీల్లేని విద్యాభ్యాసానికి విదేశీయులను చేర్చుకునేలా అమెరికా ప్రభుత్వం కూడా అనుమతి ప్రసాదించింది. ప్రస్తుతం గుర్తింపు రద్దుకు నోటీసులు జారీచేసింది. తప్పుడు అటెండెన్స్ సర్టిఫికెట్లకు సహకరించడమే కాకుండా గతంలో ఇమిగ్రేషన్ లా ఉల్లంఘనల విషయాన్ని సంస్థ దాచి పెట్టింది. విసిసి శాఖలు బ్రిటన్,త ఆస్ట్రేలియా, ఇండియా, కెనడా, న్యూజిలాండ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. భారతదేశంలో దీని శాఖలన్నీ గుజరాత్‌లోనే ఉన్నాయి. అహ్మదాబాద్, ఆనంద్, బరోడా, గాంధీనగర్, నడియాడ్‌ల్లో ఆ శాఖలున్నాయి.
-
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్ -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
వేసవిలో ఏ సమయంలో రాగి జావ తాగాలి- ఇలా చేస్తే ఫుల్ ఎనర్జీ..!! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications