జగన్‌కు షాక్: సిబిఐ కస్టడీకి మరో రెండు రోజులు

సిబిఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు జగన్‌ను కస్టడీకి అప్పగించింది. సిబిఐ కస్టడీకి కోర్టు షరతులు పెట్టింది. ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు న్యాయవాదుల సమక్షంలోనే జగన్‌ను విచారించాలని కోర్టు సిబిఐని ఆదేశించింది. జగన్‌ను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌పై అంతకు ముందు వాదనలు జరిగాయి. వాదనలు ముగిసిన తర్వాత తన నిర్ణయాన్ని హైకోర్టు కొంత సేపు రిజర్వ్‌లో ఉంచింది.
ఐదు రోజుల విచారణలో సిబిఐ జగన్‌ను వేధించలేదని సిబిఐ తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరిగిందని ఆయన చెప్పారు. వైయస్ జగన్ అక్రమాలపై వివరాలను పూర్తిగా సేకరిస్తున్నామని చెప్పారు. జగన్‌ను ఎన్ని రకాలుగా ప్రశ్నించినా వేరే వాళ్ల పైకి నెపం నెడుతున్నారని చెప్పారు. జగన్‌కు వ్యతిరేకంగా ఇటీవలి కాలంలో సాక్షులు ముందుకు వచ్చారన్నారు. దర్యాఫ్తులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో కూడా జగన్ తన సామ్రాజ్యాన్ని విస్తరించారని తెలిపారు.
జగన్ కస్టడీ కోరడం తమకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని సిబిఐ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. జగన్ మామూలు నేరస్తుడు కాదని, విచారణకు సహకరించడం లేదన్నారు. ఐదు రోజుల కస్టడీలో చాలామంది సాక్ష్యులను విచారించామన్నారు. జగన్‌ను ఎన్నిసార్లు ప్రశ్నించినా పొంతన లేని సమాధానాలు ఇచ్చారని తెలిపారు. రాష్ట్రం, ఇతర రాష్ట్రాలు విదేశాలలో నేరం జరిగినట్లుగా ఆధారాలు ఉన్నాయన్నారు. విదేశీ కంపెనీల నుంచి జగతిలోకి వచ్చిన పెట్టుబడులపై ఆరా తీయాల్సి ఉందన్నారు.
తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డు పెట్టుకొని జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డితో కలిసి కుట్ర పన్నారన్నారు. పెట్టుబడుల అక్రమాలపై ఆధారాలు ముందు పెట్టి జగన్‌ను ప్రశ్నించినా సమాధానం దాట వేశారన్నారు. పొంతన లేని సమాధానాలు ఇచ్చారన్నారు. విచారణలో చాలా తెలివిగా సమాధానాలు చెబుతున్నారని తెలిపారు. విదేశీ కంపెనీల నుంచి జగతిలోకి వచ్చిన పెట్టుబడులపై ఆరా తీయాల్సి ఉందన్నారు.


Click it and Unblock the Notifications