నర్సన్నపేట: సోదరుడిపై గెలిచిన ధర్మాన కృష్ణదాస్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 15 స్థానాల్లో విజయం సాధించగా, కాంగ్రెసు రెండు స్థానాల్లో విజయం సాధించింది. టిడిపి ఎక్కడ కూడా విజయం సాధించలేకపోయింది. తొలుత రామచంద్రాపురంలో ఆధిక్యంలో కొనసాగిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆ తర్వాత కాంగ్రెసుపై వెనకబడిపోయింది. ఈ సీటును కాంగ్రెసు పార్టీ అభ్యర్థి తోట త్రిమూర్తులు గెలుచుకున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఓటమి పాలయ్యారు. రామచంద్రాపురం, తిరుపతి, ఉదయగిరి వంటి స్థానాల్లో కాంగ్రెసు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కాంగ్రెసు గట్టి పోటీ ఇచ్చింది. తిరుపతిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి, కాంగ్రెసు అభ్యర్థి వెంకటరమణకు మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ నెలకొన్నా వైయస్సార్సీపి విజయం సాధించింది.
నెల్లూరు లోకసభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డి, కాంగ్రెసు అభ్యర్థి టి. సుబ్బిరామిరెడ్డిపై భారీ ఆధిక్యంలో ఉన్నారు. ఎమ్మిగనూరు, రాజయంపేట, రాయచోటి, రైల్వే కోడూరు, పోలవరం, పాయకరావుపేట, మాచర్ల, ప్రత్తిపాడు, తదితర నియోజకవర్గాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విజయం సాధించింది. ఈ నెల 12వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. శుక్రవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 18 శాసనసభా నియోజకవర్గాలకు, ఓ లోకసభ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధిక స్థానాలు గెలుస్తుందనే అంచనాలు సాగుతున్నాయి.












Click it and Unblock the Notifications