చేయాల్సింది చేస్తాం: టెక్కీ మృతిపై కాగ్నిజెట్ సంస్థ

Pawan Kumar
బెంగళూరు: అమెరికాలో మరణించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బెంగళూర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పవన్ కుమార్ మృతదేహాన్ని తెప్పించడానికి తాము చేయాల్సిందంతా చేస్తామని, అయితే కుటుంబ సభ్యులు తమకు సహకరించాల్సి ఉంటుందని కాగ్నిజెంట్ స్పష్టం చేసింది. శవాన్ని అప్పగించడానికి న్యూజెర్సీ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయం అడుగుతున్న పత్రాలపై కుటుంబ సభ్యులు సంతకాలు చేసి, వాటిని ఇవ్వాల్సి ఉంటుందని, అప్పుడే పవన్ కుమార్ మృతదేహాన్ని తెప్పించడానికి తమకు వీలవుతుందని కాగ్నిజెంట్ ప్రతినిధి ఆర్ రాంకుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

పవన్ కుమార్ కుటుంబ సభ్యులు ఇద్దరు న్యాయవాదులతో కలిసి తమ హెఆర్ అధికారులను శుక్రవారం కలిశారని, ఆ విషయమే వారికి చెప్పామని ఆయన అన్నారు. శవాన్ని తెప్పించడానికి అవసరమైన పత్రాలపై సంతకాలు చేయడానికి దురదృష్టవశాత్తు పవన్ కుమార్ కుటుంబ సభ్యులు నిరాకరించారని ఆయన తెలిపారు. పత్రాలపై సంతకాలు చేయడానికి పవన్ కుమర్ శవంతో పాటు ఆటాప్సీ, ఇంక్వెస్ట్ వంటి అన్ని రిపోర్టులు రావాలని కుటుంబ సభ్యులు, న్యాయవాదులు షరతులు పెడుతున్నారని, పర్సనల్ లోన్స్ వివరాలు, స్యూసైడ్ నోట్ కాపీ, బ్యాంక్ బ్యాలెన్స్ వివరాల వంటి అన్ని విషయాలు అందిస్తామని కంపెనీ గ్యారంటీ ఇవ్వాలని అడుగుతున్నారని, ఆ వివరాలు పొందే అవకాశం కంపెనీకి లేదని ఆయన వివరించారు.

అమెరికా వెళ్లడానికి ఇద్దరు కుటుంబ సభ్యులకు, అడ్వయిజర్స్‌కు అయ్యే ఖర్చులు భరించాలని అడుగుతున్నారని ఆయన చెప్పారు. కుటుంబ సభ్యులు అడుగుతున్న వివరాలను రాబట్టడానికి తాము అమెరికా అధికారులను సంప్రదిస్తూనే ఉన్నామని, అయితే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నందున లేదా పర్సనల్ ప్రైవసీ రెగ్యులేషన్స్ వల్ల వాటిని తాము పొందలేకపోతున్నామని ఆయన వివరించారు.

భారతదేశంలోని, అమెరికాలోని కాగ్నిజెంట్ సీనియర్ లీడర్‌షిప్ టీమ్స్ భారత కాన్సులేట్ అధికార వర్గాలతో కలిసి పవన్ కుమార్ శవాన్ని దేశానికి పంపించడానికి నిరంతరం ప్రయత్నాలు సాగిస్తున్నాయని, మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయం, డిస్ట్రిక్ట్ అటార్నీ, న్యూయార్క్ల్‌లోని ఇండియా కాన్సులేట్‌లను ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నాయని ఆయన వివరించారు.

తమకు సాధ్యం కాని, తమ పరిధిలో లేని పలు షరతులను పవన్ కుమార్ కుటుంబ సభ్యులు పెడుతున్నారని, తమ పరిధిలో అన్ని అంశాల విషయంలో కాగ్నిజెంట్ పనిచేస్తోందని, శవాన్ని తెప్పించడానికి అవసరమైన పత్రాలపై కుటుంబ సభ్యులు సంతకాలు చేస్తారని తాము ఎదురు చూస్తున్నామని ఆయన అన్నారు. తాము న్యూయార్క్‌లోని ఇండియన్ కాన్సులేట్‌ను నిరంతరం సంప్రదిస్తున్నామని, న్యూయార్క్ కాన్సులేట్ పవన్ కుమార్ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడుతోందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+