ఎన్టీఆర్ ఆఫీసుపై దాడి: ఫిక్స్‌లో తెలుగుదేశం పార్టీ

తెలుగు యువత కార్యకర్తలు దాడి చేశారనే విధంగా ఊహాగానాలు చెలరేగాయి. దీంతో తెలుగు యువత నాయకులు ఓ ప్రకటన ఇచ్చారు. తమకు ఈ దాడితో సంబంధం లేదని వారు స్పష్టం చేశారు. అంతేకకుండా దాడి వెనక వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు ఉండవచ్చుననే అనుమానాలను కూడా వారు వ్యక్తం చేశారు. పరిస్థితి తమకు వ్యతిరేకంగా మారవచ్చుననే ఉద్దేశంతో వారు ప్రకటనలు ఇచ్చారు.
నారా, నందమూరి కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడానికే జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయంపై దాడి చేశారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ దాడి వెనక కొడాలి నాని ఉన్నారని కృష్ణా జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు బొండా ఉమామహేశ్వర రావు ఆరోపించారు. పరిస్థితి చేయి దాటిపోకుండా రాజ్యసభ సభ్యుడు, జూనియర్ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ మొదట ప్రతిస్పందించారు. హరికృష్ణ ప్రకటన చిచ్చు పెట్టకుండా ఆపిందనే చెప్పాలి.
పరిస్థితిని గమనించిన తెలుగుదేశం నాయకులు జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయంపై దాడిని ఖండించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా ఖండించారు. దాడిని ఖండించకపోతే తమ పార్టీ జూనియర్ ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా ఉందనే సంకేతాలు కూడా వెళ్లే ప్రమాదం ఉందని గుర్తించి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రకటనలు చేశారు.












Click it and Unblock the Notifications