హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మారిన వ్యూహం: లోకేష్ వెనక్కి, బాలయ్య ముందుకి

By Pratap
|
Google Oneindia TeluguNews

Balakrishna
హైదరాబాద్: తాజా పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్ రాజకీయ ప్రవేశం వెనక్కి వెళ్లి, బాలయ్య క్రియాశీలక రాజకీయ ప్రవేశం ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు. గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని ఉదంతంతో నారా చంద్రబాబు నాయుడు తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితిలో నారా లోకేష్‌ను ముందుకు తెస్తే కొడాలి నాని విమర్శలను నిజం చేసినట్లు అవుతుందని చంద్రబాబు అనుకుంటున్నట్లు చెబుతున్నారు. దీంతో నారా లోకేష్ రాజకీయ ప్రవేశాన్ని వాయిదా వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

కొడాలి నాని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను కలవడం వెనక తన పాత్ర ఏమీ లేదని జూనియర్ ఎన్టీఆర్ చెబుతున్నప్పటికీ ఆ మాటలను చంద్రబాబు వర్గం విశ్వసించడం లేదు. నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరంగా ఉండడానికి, నాని ఉదంతానికి సంబంధం అంటగట్టే చూస్తున్నారు. పైగా, నారా లోకేష్‌ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తెచ్చి, తెలుగుయువత అధ్యక్ష పదవిని అప్పగిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడాన్ని కూడా జూనియర్ ఎన్టీఆర్‌కు లింక్ పెట్టే చూస్తున్నారు. అందువల్ల ఆ పరిణామాలను అధిగమించడానికే కాకుండా పార్టీలోని ఎదిరి వర్గాన్ని దెబ్బ కొట్టడానికి తగిన వ్యూహంలో భాగంగానే బాలకృష్ణను ముందుకు తెస్తున్నట్లు చెబుతున్నారు.

తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని, ఎన్నికల్లో పోటీ చేస్తానని బాలకృష్ణ ఇప్పటికే ప్రకటించారు. అందువల్ల సాధ్యమైనంత త్వరగా బాలకృష్ణను రంగంలోకి దించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా నుంచి తిరిగి వచ్చిన బాలకృష్ణ బుధవారం రాత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఎన్టీఆర్ అభిమానులను బయటకు పంపిస్తున్నారని, నారా లోకేష్ కోసమే అలా చేస్తున్నారని విమర్శలు వస్తున్న స్థితిలో బాలకృష్ణ క్రియాశీలక పాత్ర పోషిస్తే వాతావరణం తమకు అనుకూలంగా మారుతుందనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు.

పార్టీలో నందమూరి, నారా వారసత్వ పోరు బహిరంగ పోరుగా ముందుకు వచ్చిన ప్రతిసారీ బాలకృష్ణ రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. చంద్రబాబుకు అండగా ఆయన ఆ ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబు బాలకృష్ణను వాడుకుంటున్నారనే అభిప్రాయం ఉంది. నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లకు బాలకృష్ణను ఎదురు పెట్టి రాజకీయం నడిపిస్తున్నారని అంటున్నారు. ఇదే రీతిలో ఇప్పుడు వ్యవహరించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే, ఈసారి నేరుగానే పార్టీలో ఏదో విధమైన బాధ్యతను బాలకృష్ణ తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

English summary
With Gudivada MLA Kodali Nani incident, Telugugdesam president N Chandrababu Naidu has withdrawn the decission to make Nara Lokesh political entry. At the same time he is pushing forward NT Ramarao's son Nandamuri Balakrishna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X