జగన్‌పై అనుబంధ ఛార్జీషీట్: మళ్లీ సిబిఐకి కోర్టు షాక్

ఈ అనుబంధ ఛార్జీషీటులో కేవలం కంపెనీలను మాత్రమే నిందితులుగా పేర్కొని, కంపెనీ ప్రతినిధుల పేర్లు ప్రస్తావించక పోవడాన్ని కోర్టు తప్పు పట్టింది. ప్రతినిధుల పేర్లు కూడా ఉండాలని ఆదేశించింది. ఛార్జీషీటును చూసి నిందితులకు సమన్లు జారీ చేయాల్సి ఉంటుందని, ప్రతినిధుల పేర్లు ప్రస్తావించకపోతే జారీ చేయడంలో ఇబ్బందులు వస్తాయని తెలిపింది. కంపెనీలతో పాటు ప్రతినిధులను చేర్చి మరో ఛార్జీషీట్ దాఖలు చేయాలని ఆదేశించింది. గతంలో కూడా సిబిఐకి చెందిన ఎమ్మార్, జగన్ ఆస్తుల కేసు ఛార్జీషీట్లను కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే.
కాగా ఈ నెల 3న సిబిఐ మరో ఛార్జీషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తొలి ఛార్జీషీట్‌కు అనుబంధంగా నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టులో ఈ ఛార్జీషీట్‌ను దాఖలు చేసింది. ఒక్కో ఛార్జీషీట్ ఒక్కో కంపెనీపై దాఖలు చేస్తోంది. తాజా అనుబంధ ఛార్జీషీట్ హెటెరో డ్రగ్స్ వ్యవహారంపై ఇచ్చింది. ఈ ఛార్జీషీట్ దాఖలు చేసిన సిబిఐ జగన్ పైన మరో కేసు నమోదు చేసింది. పిసి యాక్ట్ సెక్షన్ 9 క్రింద ఈ కేసును నమోదు చేశారు. వైయస్ జగన్ తన తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రభుత్వాధికారులను ప్రభావితం చేశారని సిబిఐ తాజా ఛార్జీషీటులో పేర్కొంది.
జగన్ కంపనీలలోకి లంచాల రూపంలో పెట్టుబడులు వచ్చాయని ఆరోపించారు. హెటరో తదితర కంపెనీలు జగన్ కంపెనీలలో రూ.146 కోట్లు పెట్టుబడులు పెట్టాయని చెప్పారు. ఇవన్నీ లంచాల రూపంలోనే వచ్చాయని తెలిపారు. ఇప్పటి వరకు తాము దాఖలు చేసిన ఛార్జీషీట్లలోని రూ.35 కోట్లు లంచం రూపంలోనే జగన్ కంపెనీలలోకి వచ్చాయన్నారు. ఈ సందర్భంగా సిబిఐ కోర్టుకు ఆధారాలను సమర్పించింది. ఇద్దరు సాక్ష్యులను తమ ఛార్జీషీటులో ప్రస్తావించింది.












Click it and Unblock the Notifications