మహాత్ముడిని జాతిపితగా ప్రకటించలేదు: కేంద్రం వెల్లడి

సమాచార హక్కు చట్టం కింద అభిషేక్ కడ్యన్ అనే సామాజిక కార్యకర్త అడిగిన ప్రశ్నకు డైరెక్టర్ అండ్ సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (సిపిఐవొ) శ్యామలా మోహన్ జూన్ 18న ఇచ్చిన సమాధానంలో ఈ విధంగా పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జాతిపితగా బహుళ ప్రాచుర్యం పొందినప్పటికీ.. ప్రభుత్వపరంగా అలాంటి బిరుదు ఏదీ ఆయనకు అధికారికంగా ఎప్పుడూ ప్రదానం చేయలేదని వివరించారు. అభిషేక్ మే 21వ తేదిన జాతిపితకు సంబంధించిన వివరాలు కావాలని అడిగారు.
అంతకుముందు.. లక్నోకు చెందిన ఐశ్వర్య పరాశర్ అనే ఆరోతరగతి విద్యార్థిని బాపూజీకి జాతిపిత బిరుదు తాలూకూ ఆర్డర్ ఫొటో కాపీ కావాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకోగా.. తమ వద్ద అలాంటి పత్రమేదీ లేదని నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా ఐశ్వర్యకు సమాధానం పంపింది.
ఐశ్వర్య జాతిపిత వివరాలు ప్రధానమంత్రి కార్యాలయాన్ని కోరినప్పుడు అందుకు సంబంధించిన పత్రాలు తమ వద్ద లేవని చెబుతూ వారు ఆర్చీవ్స్ ఆఫ్ ఇండియాకు పంపారు. అక్కడ కూడా ఆ పత్రం లభించలేదు.












Click it and Unblock the Notifications