క్లాస్ నుండి బయటకు లాగి...: భార్యపై ఓ భర్త ఘాతుకం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మారుతి నందియాల్ అనే వ్యక్తి ఎల్ఐసిలో డి గ్రూప్ ఉద్యోగి. ఇతను బుధవారం మధ్యాహ్నం లైన్ బజార్‌లో అంగన్‌వాడి పాఠశాలలోకి వచ్చి తన భార్య నిర్మల మారుతి నందియాల్‌ను బయటకు లాక్కొచ్చి ఆమెపై తనతో తెచ్చిన కత్తితో దాడి చేశాడు. పదునైన కత్తితో అతడు ఆమె తల, కడుపు, మొహం పైన పొడిచాడు. దీంతో నిర్మల రక్తపు మడుగులో పడిపోయింది. దీంతో మారుతి అక్కడి నుండి పారిపోయాడు.
అకస్మాత్తుగా వచ్చి నిర్మలపై దాడి చేయడంతో అవాక్కయిన విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు వెంటనే తేరుకొని నిర్మల వద్దకు వచ్చారు. పోలీసులకు సమాచారమందించారు. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే వచ్చి ఆమెను జిల్లా సివిల్ ఆసుపత్రికి తరలించారు.
నిర్మల వయస్సు 38 ఏళ్లు. ఆమెకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఈమెకు ఇటీవల భర్తతో విభేదాలు వచ్చాయి. దీంతో నిర్మల మదరమద్దిలోని తన తల్లి వద్ద ఉంటోంది. అక్కడే అంగన్‌వాడి పాఠశాలలో పని చేస్తోంది. ఆమెపై దాడికి గల ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు. అయితే భార్యపై అతనికి అనుమానం కారణం కావొచ్చునని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications