అమ్మాయి కోసం ఎగ్జిక్యూటివ్‌ను హత్య చేసిన టెక్కీలు

Delhi Map
న్యూఢిల్లీ: తాము ప్రేమించిన అమ్మాయినే ప్రేమిస్తున్న ఎగ్జిక్యూటివ్‌ను ఇద్దరు టెక్కీలు హత్య చేసిన సంఘటన వెలుగు చూసింది. జోగీందర్ కుమార్ అనే బహుళ జాతి సంస్థ (ఎంఎన్‌సి) ఎగ్జిక్యూటివ్‌ను హత్య చేసిన కేసులో ఓ మాజీ సహోద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. కడుపులో గాయాలతో జోగీందర్ కుమార్ శవం ఢిల్లీలోని జఫర్‌పూర్ కలాన్ ప్రాంతంలో సోమవారం ఉదయం పోలీసులకు కనిపించింది.

సందీప్ (25), సోనీ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు జోగీందర్‌పైకి కారు నడిపించారని, ఆ తర్వాత శవాన్ని కాల్చారని పోలీసులు అంటున్నారు. వారి అనుచరుడు ప్రేమ్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. తన మిత్రులను కలవడానికి వెళ్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి జోగీందర్ కుమార్ ఆదివారం రాత్రి ఇంటి నుంచి వెళ్లాడు. అతను తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

జోగీందర్‌ కుమార్‌ సందీప్‌తో కలిసి చివరి సారి కనిపించడాని తెలియడంతో సందీప్ కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. హత్యలో తన పాత్ర ఉండడంతో అతను తమ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

సందీప్ మిత్రుడు సోనీ తొలుత ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న గుర్గావ్‌లోని ఓ అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఆమె సానుకూలంగా ప్రతిస్పందించకపోవడంతో తనకు సహాయం చేయాలని అతను సందీప్‌ను కోరాడు. ఆమెతో మాట్లాడే క్రమంలో ఆ అమ్మాయిని సందీప్ ఇష్టపడ్డాడు. ఇదే క్రమంలో జోగీందర్ కుమార్ ఆ అమ్మాయి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆ ఇద్దరు మిత్రులు గుర్తించి, అతన్ని తప్పించాలని అనుకున్నారు. సోనీ, ప్రేమ్‌ల సహాయంతో తాను జోగీందర్‌ను హత్య చేసినట్లు సందీప్ పోలీసుల వద్ద అంగీకరించాడు.

జులై ఏడో తేదీన గుర్గావ్‌లోని రాజీవ్‌నగర్‌కు డ్రింక్స్ కోసం జోగీందర్ కుమార్‌ను అహ్వానించామని, తమ బలవంతంతో జోగీందర్ మితిమీరి మద్యం సేవించాడని, ఆ తర్వాత తాము ముగ్గురం కలిసి సాంత్రోలో అతన్ని సారంగపూర్‌లోని గండ నాలా వద్దకు తీసుకుని వచ్చి, అతనిపై నుంచి కారు నడిపించామని, తర్వాత ఆనవాళ్లను చెరిపేయడానికి శరీరాన్ని దగ్ధం చేశామని సందీప్ పోలీసులకు చెప్పాడు. తాము సందీప్‌ను కూాడ చంపదలుచుకున్నట్లు విచారణలో సోనీ పోలీసులకు చెప్పాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+