ఇద్దరమ్మాయిలను గదిలో బంధించి..: కీచక పర్వం

ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పిన వారు ఇద్దరు అమ్మాయిలను మూడు రోజుల పాటు గదిలో బంధించారు. మాయమాటలతో మభ్యపెట్టి వారిపై అత్యాచార యత్నం చేశారు. అమ్మాయిలు వారి దుశ్చర్యలను అడ్డుకున్నారు, అరిచారు. దీంతో తమ బండారం ఎక్కడ బయటపడుతుందో అనే ఆందోళనతో వారు అరిస్తే చంపేస్తామని బెదిరించారు. బెదిరింపుల ద్వారా వారిని లొంగదీసుకున్నారు.
ఇద్దరు కలిసి అమ్మాయిలపై మూడు రోజుల పాటు తమ కోరిక తీర్చుకున్నారు. తమ కోరిక తీరిన అనంతరం వారు గుంటూరు, వైజాగ్‌లలో ఉన్న బ్రోతల్ హౌస్‌లకు అమ్మేందుకు సిద్ధపడ్డారు. ఇందుకోసం వారు వేరే వారితో ఫోన్‌లో మాట్లాడుతుండగా బాధిత అమ్మాయిలు విన్నారు. రూ.నాలుగు లక్షలకు వారిని అమ్మేందుకు వీరు సిద్ధపడ్డారు. వీరిని ఓ వాహనంలో గుంటూరు, వైజాగ్ తరలించేందుకు సిద్ధపడ్డారు.
ఈ విషయాన్ని బాధిత అమ్మాయిలు కుటుంబ సభ్యులు, పోలీసులకు ఎలాగోలా సమాచారం అందించారు. వారిని వాహనంలో తరలిస్తుండగా కుటుంబ సభ్యులు అడ్డుకొని నిందితులను పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications