జైలు నుండి అసెంబ్లీకి జగన్, మోపిదేవి తరలింపు

మోపిదేవిని, జగన్‌ను వేర్వేరు వాహనాలలో అసెంబ్లీకి తరలించారు. రెండు వాహనాలు గల కాన్వాయ్‌లో ఒక ఎస్ఐ, పదిమంది కానిస్టేబుల్స్‌తో సహా మొత్తం పద్నాలుగు మందిని మోపిదేవి కాన్వాయ్‌లో నియమించారు. ఆ తర్వాత పది నిమిషాలకు జగన్‌ను జైలు నుండి బయటకు తీసుకు వచ్చారు. అతని కాన్వాయ్‌లో రెండు వాహనాలు ఉన్నాయి. ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీస్, ఎపిఎస్పీలతో సహా పదహారు మంది పోలీసులను జగన్‌కు భద్రతగా నియమించారు. జగన్, మోపిదేవిలను ఇద్దరూ పదినిమిషాల వ్యవధిలో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలలో అసెంబ్లీకి తరలించారు.
జగన్‌ను జైలు నుండి బయటకు తీసుకు వచ్చే ముందు అక్కడకు భారీగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. ప్లకార్డులు పట్టుకొని జై జగన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వారు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అరెస్టు చేశారు. దీంతో డిజిపి, నగర పోలీసు కమిషనర్ భారీ భద్రతతో జగన్‌ను అసెంబ్లీకి తీసుకు వెళ్లాలని జైలు అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications