ఐనా శిక్ష తప్పదు: జగన్‌పై బొత్స, విజయమ్మ దీక్షపై...

అంతే తప్ప తమ పార్టీలో కలిస్తే శిక్షలు పోతాయనుకుంటే భ్రమేనన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ప్రజల్ని మభ్య పెడుతున్నారని, మోసం చేస్తున్నారని రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారని, వారి మాటల్ని నమ్మి మోసపోవద్దని ప్రజలకు చెప్పామని, అయితే, ఇప్పుడు ఉన్న పరిస్థితులలో, సానుభూతి నేపథ్యంలో వారు ఉప ఎన్నికలలో కొంత సఫలీకృతం అయ్యారన్నారు.
ఇప్పుడేమో జగన్ కేసుతో కాంగ్రెస్‌కు సంబంధం లేదని వాళ్ల నోటితోనే చెబుతున్నారన్నారు. అసలు పేరు చెప్పుకోలేని జగన్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం ప్రజల్ని మోసం చేసిందని, ఇప్పుడు ఆ విషయాన్ని వారే ఒప్పుకున్నారని బొత్స విమర్శించారు. జగన్‌పై కోర్టు కేసులకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదన్న వైయస్సార్ కాంగ్రెసు నేతల ప్రకటనపై బొత్స తీవ్రంగా స్పందించారు. వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెస్‌ల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని, ప్రణబ్‌కు అనుకూలంగా జగన్ పార్టీ ఓటుచేయడమే దీనికి నిదర్శనమన్న కథనాలను ఆయన ఖండించారు.
మ్యాచ్ ఫిక్సింగ్ అవసరం గానీ, సందర్భం గానీ, పరిస్థితి గానీ కాంగ్రెస్‌కు లేదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు వాళ్లు తమకు ఓటేసేశారే తప్ప మేము వెళ్లి అడగలేదని, కాబట్టి ఆ ఆ ప్రశ్న ఆ పార్టీ వాళ్లనే అడగాలన్నారు. విజయమ్మకి ప్రణబ్ ముఖర్జీ ఫోన్ చేశారని వారు చేసిన ప్రచారంపై తనకు స్పష్టత లేదని, హైదరాబాద్ వచ్చినప్పుడు మాత్రం ఆయన ఫోన్ చేయలేదన్నారు. ఆ తర్వాత చేస్తే చేసి ఉండొచ్చన్నారు.
బెయిల్ గురించో, మరి దేని కోసమో వాళ్లు ఓటు వేశారా అనేది తెలియదని, వాళ్లనే అడగాలన్నారు. పిసిసి అధ్యక్షుడిగా ఆ పార్టీని తాను ప్రత్యర్థి పార్టీగానే చూస్తున్నాను తప్ప స్నేహభావంతో చూడటం లేదని స్పష్టం చేశారు. విజయమ్మ సిరిసిల్ల పర్యటనపై స్పందిస్తూ.. అవన్నీ రాజకీయ జిమ్మిక్కులేనని పెదవి విరిశారు. నిర్దిష్ట ప్రణాళిక, కార్యాచరణతోనే తాము ఎన్నికల్లో పోటీ చేస్తామే తప్ప, ఎప్పుడో ఏదో జరుగుతుందని, ఎవరో వస్తారని ఆశించబోమన్నారు. ధర్మాన కమిటీ నివేదిక అందిన తరువాత.. పరిపాలనలో మార్పులు, చేర్పులు, పార్టీ తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన భవిష్యత్ ప్రణాళికను రూపొందిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఢిల్లీ పర్యటన ఉద్దేశంపై స్పందిస్తూ.. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసిన యుపీఏ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి శుభాకాంక్షలు తెలిపేందుకు ఢిల్లీ వచ్చానని చెప్పారు. కాంగ్రెస్‌తో పాటు లోక్‌సత్తా, సిపిఎం, వైయస్సార్ కాంగ్రెసుతో పాటు తెలుగుదేశం నుంచి కూడా ఐదు ఓట్లు పడ్డాయని వివరించారు. తెలంగాణ అంశంపై స్పందిస్తూ.. రాష్ట్ర విభజన, సమైక్య అంశాలు సున్నితమైనవని, వీటికి సత్వర పరిష్కారం రావాలన్నారు.
అధిష్ఠానం ఏం పరిష్కారం చూపిస్తే అదే తన అభిప్రాయం అవుతుందని స్పష్టం చేశారు. తెలంగాణపై లేఖ ఇస్తామన్న టిడిపి వ్యాఖ్యల్ని ప్రస్తావించగా.. చంద్రబాబు గంటకో మాట మారుస్తుంటారని, కాబట్టి ఆయన లేఖ ఇచ్చిన తర్వాత స్పందిస్తానన్నారు. తనపై ఆరోపణలు వచ్చినా, కోర్టుల్లో కేసులు నడుస్తున్నా స్పందించబోనని, ఇంప్లీడ్ కాబోనని పరోక్షంగా మద్యం సిండికేట్ కేసులను ప్రస్తావించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, దేనికీ భయపడబోనని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications