అమ్మాయి గొంతు నులిమి: కాలేజ్‌లో సీనియర్ల ర్యాగింగ్

Vijayanagaram Map
విజయనగరం/విశాఖపట్నం: విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. సీనియర్లు ఓ అమ్మాయిని ర్యాగింగ్ చేయడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. జిల్లాలోని గొట్లాం దగ్గర ఉన్న గాయత్రి కళాశాలలో చదువుతున్న ష్యామిలి అనే విద్యార్థిని నిద్ర పోతున్న సమయంలో సహచర విద్యార్థినులు ఆమె గొంతు నులిమారు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది.

సమాచారం అందుకున్న కళాశాల యాజమాన్యం, బంధువులు బాధితురాలు శ్యామలను వెంటనే విశాఖపట్నం కెజిహెచ్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంది. ష్యామిలి కోలుకున్న తర్వాత తనను ర్యాగింగ్ చేసిన వారి పేర్లును కాగితంపై రాసినట్లుగా తెలుస్తోంది. సదరు విద్యార్థినులు ష్యామిలిపై గత కొన్నాళ్లుగా ర్యాగింగ్‌కు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. ష్యామిలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

విశాఖపట్నం జిల్లాలోని కోటవూరట్ల మండలం కొడవటిపూడిలో ఇద్దరు బాలికలు దుర్మరణం చెందారు. పూలు కోస్తుండగా విద్యుత్ వైర్లు తెగి వారిపై పడటంతో ఇద్దరు చనిపోయారు. చిత్తూరు జిల్లాలోని వరదాయపాలెం మండలం చిన్నపాండూరులో ఓ హత్య జరిగింది. హతుడిని సహకార బ్యాంకు ఉద్యోగిగా గుర్తించారు. హంతకుల వివరాలు, హత్యకు కారణాలు తెలియరాలేదు.

చిత్తూరు జిల్లా రొంపిచర్లలో ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. రవూఫ్, నహిదా కుటుంబం నెల రోజుల క్రితం పీలేరు నుండి రొంపిచర్లకు వచ్చారు. ఇక్కడే ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. అయితే ఆర్థిక ఇబ్బందులతో శనివారం రాత్రి భార్యాభర్తలు తమ పిల్లలకు ముందుగా ఉరి వేసి అనంతరం తాము కూడా ఉరి వేసుకొని చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+