వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవి ఫ్యూచర్ ముఖ్యమంత్రి: మంత్రి గంటా జోస్యం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ganta Srinivasa Rao
విశాఖపట్నం: రాజ్యసభ సభ్యుడు చిరంజీవి భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారని దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య చెప్పిన రెండు మూడు రోజులలోనే చిరు వర్గానికి చెందిన మరో మంత్రి గంటా శ్రీనివాస రావు కూడా అవే వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన విశాఖపట్నం జిల్లాలో మీడియాతో మాట్లాడారు. చిరంజీవి భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావడం ఖాయమని జోస్యం చెప్పారు.

చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారన్న రామచంద్రయ్య వ్యాఖ్యలపై ఆయనను విలేకరులు ప్రశ్నించగా.. చిరంజీవి ప్రజల మనిషి అని, ఆయన ప్రజల నుండి వచ్చిన వ్యక్తి అని, అలాంటి వ్యక్తి భవిష్యత్తులో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని, ఇందులో ఎలాంటి అనుమానాలకు తావు లేదని, చిరంజీవి సిఎం అవుతారని తాను గట్టిగా విశ్వసిస్తున్నానని గంటా శ్రీనివాస రావు చెప్పారు.

కాగా తమ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి విషయంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సి. రామచంద్రయ్య శనివారం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చిరంజీవి త్వరలో ముఖ్యమంత్రి అవుతారని ఆయన అన్నారు. అయితే, నేరుగా చెప్పకుండా పరోక్షంగా ఆ విషయం చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో ఆయన శనివారం కాపు కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు.

చిరంజీవి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, ప్రజల అభీష్టం త్వరలో నెరవేరుతుందని ఆయన అన్నారు. అంతకు మించి ఆయన ఎక్కువగా మాట్లాడలేదు. కాపు కళ్యాణ మండపం ప్రారంభ కార్యక్రమానికి గంటా శ్రీనివాస రావుతో పాటు ఐదుగురు మంత్రులు, పలువురు శాసనసభ్యులు హాజరయ్యారు. ఇంత మంది పాల్గొన్న కార్యక్రమంలో రామచంద్రయ్య ఆ వ్యాఖ్యలు చేయడం వెనక రాజకీయ ఉద్దేశం ఉందని అంటున్నారు.

ఉప రాష్ట్రపతి ఎన్నికల తర్వాత రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరుగుతుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చర్చకు తెర తీయాలనే ఉద్దేశంతో రామచంద్రయ్య ఆ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. కాంగ్రెసులో ప్రజారాజ్యం పార్టీ విలీనం కావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. చిరంజీవికి ఆయన అత్యంత సన్నిహితుడు కూడా.

English summary

 After Endowments minister Ramachandraiah recently created a flutter by stating that Congress MP K.Chiranjeevi would become the CM, on Wednesday it was the turn of Ganta Srinivasa Rao to root for the president of the erstwhile PRP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X