జైలా, వైయస్ జగన్ కార్యాలయమా: దాడి ధ్వజం

Dadi Veerabhadra Rao
హైదరాబాద్: చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తన పార్టీని రిమోట్ కంట్రోల్‌తో నడిపిస్తున్నారని, కారాగారం ఆ పార్టీ ఆఫీసులా మారిందని తెలుగుదేశం సీనియర్ నేత దాడి వీరభద్రరావు ధ్వజమెత్తారు. తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును, తమ పార్టీని అప్రదిష్ట పాల్జేయడమే లక్ష్యంగా పెట్టుకున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అసలు తన విధానమేమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రధాన శత్రువంటూనే రాష్ట్రపతి ఎన్నికల్లో ఆ పార్టీ నిలిపిన అభ్యర్థికి ఏమాశించి ఓటు వేశారో చెప్పాలని నిలదీశారు. "బార్‌లో పనిచేసే మహిళగా సోనియాగాంధీపై కథనాలను సొంత టీవీల్లో నడిపించిన మీరు ఇప్పుడామె దయాదాక్షిణ్యాలకోసం ఎందుకు అంగలారుస్తున్నారు?'' అని ప్రశ్నించారు.

వైయస్ మరణం వెనుక కుట్ర ఉన్నట్లు ప్రధానిని కలిసినప్పుడు ఎందుకు చెప్పలేదని, కుట్ర లేకపోతే ప్రజలను మభ్యపెట్టేందుకే అబద్ధాలు చెప్పారా అని ఆయన అడిగారు. కాంగ్రెస్, సిబిఐ, తెలుగుదేశం కుమ్మక్కై జగన్‌ను జైలుకు పంపినట్లు వాపోయిన విజయలక్ష్మి ఇప్పుడు కాంగ్రెస్, సిబిఐ విచారణ వేరంటూ ప్లేటు ఫిరాయించడంలో అంతరార్థం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో విలీనం కాదలచుకుంటే తేదీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

గాలి జనార్దన్ రెడ్డి బహుమతిగా ఇచ్చిన ప్రచార రథాన్ని వైయస్ రాజశేఖర రెడ్డి వాడుకోలేదా అని, గాలి తన దత్త పుత్రుడని వైఎస్ చెప్పలేదా అని, జగన్ తనకు దేవుడిచ్చిన తమ్ముడని జనార్దన రెడ్డి అనలేదా అని నిలదీశారు. వైఎస్ హయాం నుంచి ఇప్పటిదాకా ఎన్నో విచారణలు, కేసులు పెట్టినా చంద్రబాబు నిర్దోషిత్వమే రుజువైందన్నారు. తప్పుడు కేసులు, తప్పుడు మాటలతో కోర్టులను, ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇక రత్నగిరి విద్యుత్ ప్లాంటుకు గ్యాస్ మళ్లింపుపై సిపిఐ ఏర్పాటు చేసిన భేటీలో వైయస్సార్ కాంగ్రెసుతో మీరు వేదిక పంచుకున్నారు కదా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే ఆ పార్టీ హాజరవుతున్నట్లు తమకు తెలియదన్నారు. అయినా, ఆ పార్టీతో కలసి పనిచేసేది లేదని తమ పార్టీ ప్రతినిధి దేవేందర్‌గౌడ్ అక్కడే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణకు చెప్పారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+