బహునాయకత్వమే:టిడిపి ఎమ్మెల్యే సంచలనం, బాబుపై

ఒక్కో ప్రాంతంలో పది మంది నాయకులు ఉండటం వ ల్లే అభివృద్ధి కుంటుపడుతోందన్నారు. పార్టీ కూడా సంక్షోభం ఎదుర్కొంటుందన్నారు. బహునాయకత్వమే పార్టీ కొంప ముంచుతోందని అన్నారు. ఈ విషయాన్ని తాను బాబుకు స్పష్టం చేశానని చెప్పారు. ఒక్క నాయకుడు కాకుండా చాలా మంది నాయకులు ఉండటం వల్ల నష్టాన్ని బాబుకు తాను వివరించానని తెలిపారు.
పత్తిపాటి పుల్లారావు బహునాయకత్వం వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ఆయన వ్యాఖ్యలతో పార్టీలోని పలువురు నాయకులు ఏకీభవిస్తున్నారని అంటున్నారు. కాగా ఇటీవల కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వల్లభనేని వంశీ, దేవినేని ఉమా మహేశ్వర రావు, కొడాలి నాని వ్యవహారం నేపథ్యంలో పుల్లారావు వ్యాఖ్యలు చర్చకు తెరలేపాయి.












Click it and Unblock the Notifications