ప్రేమ మోసం: ప్రియుడు ఆఫీస్‌లో టెక్కీ విశాలిని సూసైడ్

మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మణికంట అనే ఇరవయ్యెనిమిదేళ్ల యువకుడిపై కేసు నమోదు చేశారు. ఇతని సొంత జిల్లా తూర్పుగోదావరి. ఇతనిపై ఎస్సీ ఎట్రాసిటీతో పాటు చీటింగ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
విశాలిని, మణికంట మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారిద్దరు కలిసి జెన్‌పాక్ట్ అనే సాఫ్టువేర్ కంపెనీలో సాఫ్టువేర్ ఇంజనీర్లుగా పని చేశారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకుంటానని విశాలినికి అతను ప్రామిస్ చేశాడు. అయితే అతను మాట తప్పడంతో డిప్రెషన్‌కు లోనైన విశాలిని అతని కార్యాలయంలోనే ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారు.
నిందితుడు సంవత్సరం క్రితం జెన్‌పాక్ట్‌లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి బల్కంపేటలో కొత్త సాఫ్టువేర్ కంపెనీ ప్రారంభించాడు. విశాలిని తరుచూ ఇతని కార్యాలయానికి వచ్చేది. ఐదు రోజుల క్రితం నిందితుడు తన కంపెనీని బేగంపేటకు తరలించాడు. సోమవారం బల్కంపేట కార్యాలయం వద్దకు వెళ్లడంతో అక్కడ విశాలినికి ఎవరూ కనిపించలేదు. దీంతో ఆమె డిప్రెషన్‌కు లోనై ఆత్మహత్య చేసుకుంది. నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications