గోల చేస్తే ఊరుకోం: టి-ఎంపీలకు సోనియా చివాట్లు

వారి వైఖరితో సోనియాలో ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇప్పటికే విపక్షాలు అస్సాం ఘర్షణలను, అమెరికాలో సిక్కుల ఊచకోత అంశాలు లేవనెత్తి కేంద్రంపై విరుచుకు పడుతుండగా ఎంపీలు కూడా తెలంగాణ అంశంపై ఆందోళన చేయడంతో ఆమె మండిపడ్డారు. విపక్షాలకు మనకు తేడా ఏమిటని ఆమె సొంత పార్టీ ఎంపీలను ప్రశ్నించారు. సోనియాకు సర్ది చెప్పాలని వారు ప్రయత్నించినప్పటికీ అది కురదలేదు.
సభలో గొడవ చేస్తే సహించేది లేదని, అంతగా అనుకుంటే బయటకు వెళ్లి నిరసన తెలియజేసుకోండని ఆమె వారిపై మండిపడ్డారు. సభలో ఉండి గొడవ చేస్తే మాత్రం బయటకు పంపించడమే కాకుండా మరోసారి లోనికి రానిచ్చేది లేదని హెచ్చరించారు. సోనియా చివాట్లు పెట్టడంతో ఎంపీలు కిమ్మనకుండా సభ నుండి బయటకు వెళ్లి పోయారు.
మరోవైపు అద్వానీ చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి. యుపిఐఏ-2 అక్రమమని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై సోనియాతో పాటు అధికార పక్ష నేతలు మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను ఖండించారు. కాసేపటికి అద్వానీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications