నాలుగు స్తంభాల్ని కూల్చి..నిర్మించాడు: జగన్‌పై రేవంత్

Revanth Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యానికి అవసరమైన నాలుగు స్తంభాలను కూల్చి వేశారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి గురువారం మండిపడ్డారు. ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యానికి అవసరమైన నాలుగు స్తంభాలను కూల్చి వేసిన జగన్ అవినీతి, అక్రమాలు, అసత్యం, చీకటి ఒప్పందాలనే స్తంభాలను నిర్మించుకున్నారని విమర్శించారు.

జగన్ మీడియా సంస్థలు న్యాయస్థానాన్ని సైతం తప్పుదోవ పట్టించాయని, సిబిఐ సీజ్ చేసిన ఖాతాలను కాకుండా వేరే ఖాతాలను జగన్ సంస్థలు నిర్వహిస్తున్నాయని రేవంత్ ఆరోపించారు. తప్పుడు సమాచారం కారణంగానే జగన్ సంస్థలకు హైకోర్టు జరిమానా విధించిందన్నారు. జైలు నుండి ప్రారంభమై జరిమానాలతో జగన్ పార్టీ పని ముగుస్తుందని జోస్యం చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికలలో ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేయడం ద్వారా తాము కాంగ్రెసు పార్టీలో విలీనమవుతామనే సంకేతాలు జగన్ పార్టీ ఇచ్చిందన్నారు.

జగన్ తన పార్టీని ఎప్పటికైనా కాంగ్రెసులో విలీనం చేయడం ఖాయమన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ బైబిల్ చేతిలో పట్టుకొని అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. గ్రంథం పట్టుకొని అసత్య ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్మరన్నారు. అధికారం కోసమే విజయమ్మ ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి శాసనవ్యవస్థ, ప్రభుత్వ శాఖలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు.

కోలా కృష్ణ మోహన్‌ను జగన్ మీడియా నెత్తుకెత్తుకుందని, ఇప్పుడు ఆయనను పోలీసులు అరెస్టు చేశారని, దానిపై వారు ఏం సమాధానం చెబుతారన్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు విజయమ్మ, సోనియా గాంధీ మధ్య రహస్య ఒప్పందం జరిగిందన్నారు. అది బెయిల్ ఒప్పందమో మరేదో కానీ కొంతకాలమైతే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. వారిద్దరు కలిశారన్న వార్తలను కాంగ్రెసు పార్టీ నేత మనీష్ తివారి ఖండించలేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+