నిప్పు పెట్టి భర్తను చంపేసిన మహిళ, తట్టుకోలేకే

woman kills husband in Hyderabad
హైదరాబాద్: వేధింపులు భరించలేక ఓ మహిళ తాళి కట్టిన భర్తనే చంపేసింది. ఈ సంఘటన హైదరాబాదులోని కూకట్‌పల్లిలో మంగళవారం రాత్రి జరిగింది. కూకట్‌పల్లిలోని శివలాల్ తండాలో నివసిస్తున్న దశరథ్ (38) అనే ఐడిఎల్ కాంట్రాక్టు ఉద్యోగిని భార్య లావణ్య నిప్పు పెట్టి చంపేసింది. వారికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

మద్యం సేవించి దశరథ్ భార్యను వేధిస్తూ ఉండేవాడని పోలీసులు చెప్పారు. దశరథ్‌కు ఇటీవల 40 వేల రూపాయల ప్రావిడెంట్ ఫండ్ వచ్చింది. దాన్ని తాగుడుకు పెడతాడనే భయంతో లావణ్య ఆ సొమ్మును సద్వినియోగం చేసే ఉద్దేశంతో తన తల్లిదండ్రులకు ఇవ్వాలని అనుకుంది. దాన్ని దశరథ్ వ్యతిరేకించాడు.

మంగళవారం రాత్రి తాగి వచ్చిన దశరథ్‌పై లావణ్య మండిపడింది. బుధవారం తెల్లవారు జామున దశరథ్ తలను గ్రైండింగ్ రాయితో చితక్కొట్టింది. కాళ్లూ చేతులూ కట్టేసింది. కిరోసిన్ పోసి అతని ఒంటికి నిప్పంటించింది. ఇదంతా వారి ఇద్దరు కూతుళ్లు చూస్తూనే ఉన్నారు. దశరథ్ అక్కడికక్కడ మరణించాడు.

ఈ సంఘటనను ఉదయం పూట గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆమె, ఆమె సోదరుడు యాదగిరిరావును కూకట్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాదగిరి రావు హత్యకు ప్రేరేపించి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+