కాళహస్తి ఆలయఉద్యోగి వ్యభిచారం: పిల్లల్నిచంపిన తల్లి

మోహన్ ఓ పార్లమెంటు సభ్యుడికి అనుచరుడిగా చెబుతున్నారు. దీంతో అతనిపై కేసు నమోదు చేయకుండా రాజీ కోసం పోలీసులపై ఒత్తిళ్లు వస్తున్నాయని అంటున్నారు. మోహన్ మహిళతో రాసలీలలు జరుపుతున్నట్లు పోలీసులు చెప్పారు. అతనిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
మరోవైపు గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని రాజీవ్ నగర్‌లో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు ఉరి వేసి చంపింది. శైలజ, సురేష్‌లు భార్యాభర్తలు. సురేష్ ఆటో నడుపుతుంటాడు. అతనికి మరో మహిళతో సంబంధముందని తెలిసిన భార్య శైలజ భర్తకి నచ్చ చెప్పే ప్రయత్నాలు చేసిందని సమాచారం. అతను వినకపోవడంతో విసిగిపోయిన ఆమె చివరకు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది.
తాను చనిపోతే తన పిల్లలు అనాథలు అవుతారని భావించి తొలుత తన పిల్లలైన నాలుగేళ్ల అజయ్, మూడేళ్ల విజయ్‌లకు ఉరి వేసి చంపింది. ఆ తర్వాత తాను విషం తాగింది. ఇది గమనించిన గ్రామస్తులు ఆమెను చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు. తాను చస్తానని అనుకున్నానని, కానీ చావలేదని, తాను చస్తే పిల్లలు ఏమవుతారో అనే బాధతోనే వారికి ఉరి వేసినట్లు చెప్పింది. కాగా భర్త సురేష్ పరారీలో ఉన్నాడు.












Click it and Unblock the Notifications