జగన్ సన్నగా ఉన్నాడని.. కరెంట్: రోజా 'ఎన్టీఆర్' డైలాగ్

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి జలయజ్ఞాన్ని పూర్తిస్థాయిలో నిర్వహించాలనే తపన ఉండేదని చెప్పారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ప్రస్తుత ప్రభుత్వం నిధులు మంజూరు చేయకుండా నిర్ల క్ష్యం వహిస్తోందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి తన కుర్చీని కాపాడుకునేందుకు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు.
తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సన్నగా ఉన్నాడులే ఏం చేస్తాడు అనుకుంటే పొరపాటేననీ, విద్యుత్ తీగ కూడా సన్నగా ఉంటుందనీ.. పట్టుకుంటే దాని పవర్ ఏంటో తెలుస్తుందని అన్నారు. వంద సీట్లు ఇవ్వడం కాదు, వంద మంది బిసిలను అసెంబ్లీకి పంపించాలని ప్రతిపాదించిన తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మని తెలుగుదేశం పార్టీ విమర్శించడం తగదన్నారు.
ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలని, తరువాత అభివృద్ధిపై దృష్టిసారించాలని, అలా కాకుండా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయలేదనే కక్షతో తిరుపతి అభివృద్ధిని అడ్డుకోవడం ఎంతవరకూ న్యాయమని తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్‌ను కలిసి తిరుపతి సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
దేశంలో ఉన్న 65 ముఖ్యపట్టణాల్లో తిరుపతి ఒకటని, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న జేఎన్ఎన్‌యూఆర్ఎం పథకం ద్వారా రూ.2600 కోట్లను విడుదల చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పారన్నారు. ఈ నిధుల్లో కేవలం 150 కోట్లు మాత్రమే విడుదల చేసి మురికికాలువలు, ఇతర చిన్న చిన్న పనులు మాత్రమే చేసి వదిలేశారన్నా రు. తిరుపతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయలేదనే కారణంతో నిధుల విడుదల విషయంలో జాప్యం చేస్తున్నారన్నారు. ఉప ఎన్నికల ముందు తిరుపతి అభివృద్ధికి రూ. 450 కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఎన్నికలయ్యాక ఆ ఊసే ఎత్తడం లేదన్నారు.












Click it and Unblock the Notifications