వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహారీలు: అదే దారిలో ఉద్దవ్: రాజ్‌కి నటి రవీనా సపోర్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Uddhav Thackeray-Raveena Tandon
ముంబై: బీహారీలకు వ్యతిరేకంగా శివసేన కార్య నిర్వాహక అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే కూడా మంగళవారం వ్యాఖ్యలు చేశారు. ముంబయికి వలస వచ్చిన బీహారీలకు అనుమతి పత్రాన్ని జారీ చేసే విధానాన్ని అమలు చేయాలని సూచించారు. మహారాష్ట్రలో నేరం చేసిన నిందితులను బీహార్‌లో అరెస్ట్ చేయడానికి ఇక్కడి పోలీసులకు అనుమతి అవసరమైతే.. బీహార్ నుంచి తమ రాష్ట్రానికి వచ్చే వాళ్లకు అనుమతి పత్రాన్ని జారీ చేసే విధానాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విద్రోహులను వెనకేసుకొస్తే ఎన్డీయే తరపున ప్రధానిగా ఆయన అభ్యర్థిత్వాన్ని అంగీకరించబోమని ఉద్ధవ్ అన్నట్లు శివసేన పత్రిక 'సామ్నా' వెల్లడించింది. అమర్ జవాన్ స్మారకస్తూపాన్ని అవమానపరిచిన వ్యక్తి బీహార్ వాసుడైనందుకు నితీష్ సిగ్గుపడాలని కూడా పేర్కొంది. ఆజాద్ మైదాన్ హింసాత్మక ఘటనలకు పాల్పడి బీహార్‌కు పారిపోయి వచ్చిన వారికి నితీష్ మద్దతు తెలిపి వివాదాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు.

కాగా గత వారం మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే బీహారీలను అక్రమ వలసదారులుగా పేర్కొన్న విషయం తెలిసిందే. వారికి పర్మిట్లు ఉండాలని డిమాండ్ చేశారు. తాజాగా ఉద్దవ్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. మరోవైపు బీహారీలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు గాను రాజ్ ఠాక్రే పైన పోలీసులు కేసు నమోదయింది. బీహార్‌లోని నలంద జిల్లా కోర్టులో ఈ కేసు సోమవారం నమోదైంది.

కాగా పాకిస్తాన్ కళాకారులకు వ్యతిరేకంగా రాజ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలకు బాలీవుడ్ నుండి మద్దతు లభించింది. ఆయన వ్యాఖ్యలకు ఇదివరకు ఇతర రంగాల నుండి మాత్రమే మద్దతు వచ్చేది. కానీ తాజాగా బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూడా రాజ్ వ్యాఖ్యలను సమర్థించారు. రాజ్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని, ఓ టీవీ ఛానల్‌లో ప్రసారం కానున్న సూరక్షేత్ర కార్యక్రమంలో పాక్ కళాకారులు పాల్గొనడాన్ని వ్యతిరేకిస్తూ రాజ్ చేసిన వ్యాఖ్యలు సమర్థనీయమే అన్నారు.

English summary
Unfazed by strident criticism of his cousin MNS leader Raj Thackeray over his anti-Bihari remarks, Shiv Sena executive president Uddhav Thackeray on Tuesday sought a permit system to check influx of Bihari migrants into Mumbai. Uddhav also declared that his party would not accept Bihar chief minister Nitish Kumar as NDA's prime ministerial candidate if he continues to stick to his stand on supporting "traitors".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X