కెవిపి 'వైఎస్ పాదయాత్ర-మై డైరీ': ఢిల్లీకి మంత్రుల క్యూ

పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గు లాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీతోపాటు మరికొందరు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు కూడా హాజరు కానున్నారు. కెవిపి గురువారం ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిసి ఈ పుస్తక ఆవిష్కరణ సభకు ఆహ్వానించారు. ఈ ఆహ్వాన పత్రికను ప్రధాని ఆసక్తిగా చదివారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులందరినీ కెవిపి ఆహ్వానించారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గురువారం రాత్రే ఢిల్లీకి బయలుదేరారు.
ఈ రోజు మంత్రులు రఘువీరా రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, వట్టి వసంత కుమార్, గీతా రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, విశ్వరూప్, పొన్నాల, దానం, అహ్మదుల్లా, మాణిక్య వర ప్రసాద్ ఢిల్లీ వెళ్లనున్నారు. సాక్షర భారత్ అవార్డును అందుకునేందుకు లక్నో వెళ్తున్న మంత్రి శైలజానాథ్ కూడా కెవిపి కార్యక్రమంలో పాల్గొననున్నారు. మరోవైపు... మహబూబ్‌నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇందిర మ్మ బాట షెడ్యూల్ ఖరారు చేయాల్సి ఉంది.
ఇందుకోసం మంత్రి డికె అరుణ శుక్రవారం సిఎం కిరణ్‌తో సమావేశం కానున్నారు. అది త్వరగా పూర్తయితే... ఆమెతో పాటు మంత్రి సునీతా లక్ష్మా రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశముంది. మంత్రి పార్థసారథి, సారయ్య ఢిల్లీకి వెళ్లడం లేదు. మరో మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ఢిల్లీ వెళ్తున్నా అధిష్ఠానం పెద్దలను కలిసేందుకే ప్రాధాన్యమిస్తున్నారు. డిఎల్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లేదు. వైయస్ పుస్తకావిష్కరణను వ్యతిరేకిస్తున్న వి హనుమంత రావు కూడా దీనికి హాజరు కారు.
పుస్తకావిష్కరణ పేరిట వైయస్ వర్గాన్ని ఏకం చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలన్న ఆయన ఇటీవల కాంగ్రెసు నేతలకు సూచించిన విషయం తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్ జగన్ పార్టీ తరఫున కెవిపి కోవర్టుగా పని చేస్తున్నారని వాపోయినా అధిష్ఠానం పట్టించుకోలేదు.












Click it and Unblock the Notifications