రామోజీ కొడుకు సుమన్ మృతికి వైఎస్సార్సీ సంతాపం

రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న సుమన్ భౌతికాయానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, ఎంపీ సుజనా చౌదరి, ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి, మంత్రులు డికె అరుణ, సబితా ఇంద్రా రెడ్డి తదితరులు నివాళులు అర్పించారు. వారందరూ సుమన్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. బహుముఖ ప్రజ్ఞాశాలిని కోల్పోయామని చంద్రబాబు, కిరణ్ అన్నారు.
ఈటీవి స్థాపన, విస్తరణలో ఉన్నత ప్రమాణాలతో విశేష కృషి చేసిన వ్యక్తి సుమన్ అని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడు కొనియాడారు. సృజనాత్మకత ఉన్న మంచి రచయితను కోల్పోయామని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.
మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్ బాబు, ఆనం రామనారాయణ రెడ్డి, డికె అరుణ, సునీతా లక్ష్మా రెడ్డి, బాలరాజు, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఎంపీలు హరికృష్ణ, నామా నాగేశ్వర రావు, పొన్నం ప్రభాకర్, కావూరి సాంబశివ రావు, మధుయాష్కీ, ఎమ్మెల్యేలు మోత్కుపల్లి నర్సింహులు, హరీష్ రావు, బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. మంచి నటుడిని కోల్పోయామని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెసు ముఖ్యనేత చిరంజీవి అన్నారు.












Click it and Unblock the Notifications