వైయస్ మా వాడే: కాంగ్రెసు హైకమాండ్ పెద్దలు

YSR dairy
న్యూఢిల్లీ: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి వారసత్వం తమదేనని కాంగ్రెసు అధిష్టానం పెద్దలు చెప్పుకున్నారు. రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రపై సంకలనం చేసిన వైయస్ పాదయాత్ర - మై డైరీ పుస్తకావిష్కరణ సభలో వారు అలా చెప్పుకున్నారు. పుస్తకాన్ని కాంగ్రెసు సీనియర్ నేత మోతీలాల్ వోరా ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ సీనియర్ నేత ఎం. సత్యనారాయణరావును ఆయన సత్కరించారు. సభలో గులాం నబీ ఆజాద్, వాయలార్ రవి, మోతీలాల్ వోరా, టి. సుబ్బిరామిరెడ్డి ప్రసంగించారు. వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేపట్టిన సమయంలో తాను పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీగా ఉన్నానని వాయలార్ రెవి చెప్పారు. వైయస్ పాదయాత్ర చరిత్ర సృష్టించిందని ఆయన కొనియాడారు.

వైయస్ పాదయాత్రకు తాను పూర్తిగా మద్దతు ఇచ్చానని, పాదయాత్ర ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని అధికారంలోకి తెస్తుందని తాను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి చెప్పానని ఆయన అన్నారు వైయస్ పాదయాత్రలో తాను పాల్గొన్న తర్వాత ఆ విషయం చెప్పానని ఆయన అన్నారు. వైయస్ కాంగ్రెసు మనిషి అని, నెహ్రూ, ఇందిరా గాంధీ కుటుంబాలకు విధేయుడని ఆయన అన్నారు. కాంగ్రెసుతోనే తన రాజకీయం ముడిపడి ఉందని చెబుతూ ఉండేవారని ఆయన అన్నారు. వైయస్ వారసత్వం కాంగ్రెసు పార్టీదేనని, వేరేవాళ్లు ఆ వారసత్వాన్ని అడగడానికి వీల్లేదని ఆయన అన్నారు. వైయస్ వారసత్వం కాంగ్రెసు పార్టీకి ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నామని ఆయన అన్నారు.

వైయస్ కాంగ్రెసు పార్టీకి కట్టుబడిన నాయకుడని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఏ రోజు కూడా లక్ష్మణరేఖ దాటలేదని ఆయన ప్రశంసించారు. వైయస్ పాదయాత్ర అత్యంత విజయవంతమైన యాత్ర అని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి గొప్ప నాయకుడే కాదు, క్రమశిక్షణను పాటించిన వ్యక్తి అని ఆయన అన్నారు. సిఎల్పీ నేతగా ఉన్న వైయస్ రాజశేఖర రెడ్డి సహకరించి ఉండకపోతే కాంగ్రెసు 2004లో గెలిచి ఉండేది కాదని ఆయన అన్నారు. వైయస్ ఒక ప్రత్యేక సామాజిక వర్గానికి చెందినవాడైనా అన్ని సామాజిక వర్గాల ఆదరణను చూరగొన్నారని ఆయన అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేతగా కూడా రాణించారని మోతీలాల్ వోరా అన్నారు. సంక్షేమ పథకాలను వైయస్ విజయవంతంగా అమలు చేశారని ఆయన అన్నారు. వైయస్ ప్రజానాడి తెలిసిన నాయకుడని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అధ్యక్షత వహించారు. చిరంజీవి, ఎం. సత్యనారాయణ, టి. సుబ్బిరామిరెడ్డి రాష్ట్రానికి సంబంధించిన నాయకుల్లో వేదిక మీద కూర్చున్నారు. దిగ్విజయ్ సింగ్, జనార్దన్ ద్వివేది, రాజీవ్ శుక్లా, ఆస్కార్ ఫెర్నాండెజ్, ఆర్‌కె ధావన్ వేదిక మీద కూర్చున్నారు.

పార్లమెంటు సభ్యులు జెడి శీలం, పొన్నం ప్రభాకర్, లగడపాటి రాజగోపాల్, సాయి ప్రతాప్, రాజయ్య, నంది ఎల్లయ్య తదితర పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర మంత్రులు మంత్రులు కాసు కృష్ణారెడ్డి, గల్లా అరుణకుమారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+