హర్షారెడ్డి కిడ్నాపర్ల అరెస్ట్: డబ్బుకోసమే, నెలక్రితం ప్లాన్

 Harsha Reddy
హైదరాబాద్: యశోద ఆసుపత్రి వైద్యుడు హర్షా రెడ్డి కిడ్నాప్ వ్యవహారంలో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. కీలక సూత్రధారితో సహా ముగ్గుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. డబ్బు కోసమే వారు డాక్టర్‌ని అపహరించారని పోలీసులు స్పష్టం చేశారు. నిందితుల్లో కృష్ణా జిల్లా నున్న గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ రెడ్డి, అతని వద్ద పనిచేసే శివయ్య, విజయవాడ రూరల్‌లోని పాతపాడు ప్రాంత వాసి, సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న దుర్గా రెడ్డిలు ఉన్నారు.

కారు డ్రైవర్ సూదిరెడ్డి మురళీ కృష్ణా రెడ్డి, ట్రాక్టర్ డ్రైవర్ రాజులు పరారీలో ఉన్నారు. అఫ్జల్‌గంజ్ పోలీస్‌ స్టేషన్‌లో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తూర్పు మండల డిసిపి గంగాధర్ వివరాలను వెల్లడించారు. కృష్ణా జిల్లా నున్న గ్రామానికి చెందిన డాక్టర్ హర్షా రెడ్డి మలక్‌పేట యశోదా ఆస్పత్రిలో డిఎన్ఏ రెడియాలజిస్ట్‌గా పని చేస్తున్నాడు. హర్షా రెడ్డి పెదనాన్న కుమారుని బావమరిది శ్రీనివాస్‌ రెడ్డి తన తండ్రి అనారోగ్యానికి గురవడంతో సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చేర్చాడు.

ఆ సమయంలోనే హర్షా రెడ్డి తనకు బంధువని తెలుసుకున్నారు. దురలవాట్లతో అప్పుల పాలైన శ్రీనివాస్‌ రెడ్డి కోటీశ్వరైడనహర్షా రెడ్డిని కిడ్నాప్ చేసి రూ.50 లక్షలు రాబట్టుకోవాలని నెలన్నర క్రితమే పథకం రూపొందించుకున్నాడు. ఈ నెల 3వ తేదీ సాయంత్రం శ్రీనివాస్‌ రెడ్డి డాక్టర్ హర్షా రెడ్డిని ఆస్పత్రి నుంచి తీసుకెళ్లి బయట ఉన్న కారులో ఎక్కించుకున్నాడు. అప్పటికే కారు వెనుక సీటులో శివయ్య, సూదిరెడ్డి మురళీ కృష్ణారెడ్డి, వల్లరాజు ఉన్నారు.

కారు వనస్థలిపురం వరకు వెళ్లగానే ముందు సీట్లో కూర్చున్న హర్షా రెడ్డి గొంతుకు వైర్ బిగించి చేతులు కట్టేసి డబ్బులు డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. ఇక్కడ పథకాన్ని తెలివిగా మార్చారు. డ్రైవింగ్ సీట్‌లో ఉన్న శ్రీనివాస్‌ రెడ్డి కోటి రూపాయలు బాకీ ఉన్నాడని, అందులో రూ. 50 లక్షలు ఇస్తే వదిలేస్తామని, లేదంటే శ్రీనివాస్‌ రెడ్డితోపాటు నిన్ను కూడా చంపుతామని బెదిరించారు. హర్షా రెడ్డి సెల్ తమతో ఉంటే ఇబ్బందని గ్రహించి దుర్గా రెడ్డిని పిలిపించి ఫోన్ ఇచ్చారు.

అదేరోజు రాత్రి హర్షా రెడ్డిని నూజివీడు తీసుకెళ్లి షెడ్డులో బంధించారు. మరుసటి రోజు దుర్గా రెడ్డికి ఫోన్ చేసి విజయవాడకు రమ్మన్నారు. ఆయన వస్తున్న కారు సూర్యాపేట వద్ద మొరాయించింది. ఈ విషయాన్ని విజయవాడలో ఉన్న తన సోదరుడైన మురళి, కృష్ణారెడ్డిలకు ఫోన్‌చేసి చెప్పాడు. వారిద్దరూ శ్రీనివాస్‌ రెడ్డితోపాటు సూర్యాపేటకు వచ్చి కారు రిపేరు చేయించుకున్నారు. అక్కడి నుంచే హర్షా రెడ్డి తండ్రి లక్ష్మా రెడ్డికి ఫోన్ చేశారు.

హర్షా రెడ్డి మా అమ్మాయితో సూర్యాపేటలో దొరికాడు, అతన్ని వదలాలంటే 50 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ షరతులు విధించి కాల్ కట్ చేశాడు. అనుమానం రాకుండా ఉండేందుకు హర్షా రెడ్డి ఫోన్‌ను అక్కడే పడేసి సిమ్ తీసుకున్నారు. అయితే కిడ్నాప్ చేసింది శ్రీనివాస్‌ రెడ్డేనని పోలీసులు అనుమానించి పలుమార్లు ఫోన్ చేశారు. తర్వాత టాస్క్‌ఫోర్స్ బృందానికి స్వయంగా ఫోన్‌ చేసిన శ్రీనివాస్‌ రెడ్డి అసలు కిడ్నాపర్లను చూపిస్తానంటూ చెప్పాడు.

ఒక సివిల్ పోలీస్‌ను తీసుకెళ్లి, మధ్యలోనే పారిపోయాడు. విషయాన్ని టాస్క్‌ఫోర్స్ బృందం వెంటనే విజయవాడ ఉన్నతాధికారులకు తెలిపింది. తన మనుషులైన రాజు, మురళిలకు ఫోన్‌ చేసి కిడ్నాప్ విషయం పోలీసులకు తెలిసిపోయిందని, హర్షా రెడ్డిని చంపేసి పారిపొమ్మని చెప్పాడు. వారు భయంతో హర్షా రెడ్డిని వదిలిపెట్టి పారిపోయారు. అయితే పోలీసులు పన్నిన వలలో నిందితులు చిక్కుకున్నారు. కిడ్నాప్‌కు ముందు హర్షా రెడ్డి ఇంటిపై రెండుసార్లు రెక్కీ నిర్వహించారని పోలీసులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+