ఎమ్మెల్యే ఇంట్లో దొంగలు పడ్డారు: రూ.20 లక్షలు చోరీ

చోరీ జరిగినట్లు సోమవారం ఉదయం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒంగోలు డిఎస్పీ ఎం రజనీకాంత్ రెడ్డి, సిఐలు కాసీం బేగ్, శ్రీనివాసన్ వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
ఎమ్మెల్యే ఇంటితో పాటు మరో ఇంట్లో కూడా దొంగలు దోపిడీ చేశారు. శేషు ఇంటి పక్కన ఉన్న ఓ కానిస్టేబుల్ ఇంట్లోనూ దోపిడీ దొంగలు చోరీ చేశారు. అయితే కానిస్టేబుల్, కుటుంబం ఇంట్లో లేనందున ఆ ఇంట్లో ఎంత మేర దొంగతనం జరిగిందో తెలియరాలేదు. ఇటీవల దోపిడీ దొంగలు ప్రజాప్రతినిధుల ఇళ్లను టార్గెట్ చేసుకుంటుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications