పదవులు శాశ్వతం కాదు: కిరణ్, ఎదుర్కొంటాం.. బొత్స

Botsa Satyanarayan - Kiran Kumar Reddy
మహబూబ్ నగర్: డబ్బు, ఆస్తులు, పదవులు శాశ్వతం కాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం అన్నారు. కిరణ్ మహబూబ్ నగర్ జిల్లాలో ఇందిర బాట కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. మూడో రోజైన ఆదివారం ఆయన పాలమూరు విశ్వవిద్యాలయం విద్యార్థులతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత జిల్లా కాంగ్రెసు పార్టీ సమావేశంలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో పాటు కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భాలలో కిరణ్ మాట్లాడారు.

డబ్బు, పదవులు, ఆస్తుల శాశ్వతం కాదని విద్య ఒక్కటే శాశ్వతమన్నారు. విద్యారంగంపై తమ ప్రభుత్వం రూ.28 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. ఏడాదికి నాలుగు వేల కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్సుమెంట్స్ కోసం ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెసు పార్టీని ఓడించే సత్తా ఎవరికీ లేదన్నారు. పార్టీలోని అనైక్యత వల్లే ఇతర పార్టీలు గెలుపొందుతుంటాయన్నారు. ప్రాంతీయ వాదం వల్ల పార్టీలో గ్యాప్ నిజమే అన్నారు.

పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేసే వారిని తాము వదులుకునేది లేదన్నారు. పార్టీ కార్యకర్తలకు గుర్తింపు కార్డులు ఇచ్చే యోచనలో ఉన్నట్లు కిరణ్ చెప్పారు. త్వరలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని, స్థానిక సంస్థల కోసం రెండు నెలల్లో నియోజకవర్గాలలో సమావేశాలు జరుపుతామన్నారు. ముస్లింల అభివృద్ధికి పార్టీ కృషి చేస్తోందని, మైనార్టీలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్‌లను మరో పదేళ్లు పొడిగిస్తున్నట్లు చెప్పారు.

కృష్ణాలో నీళ్లు లేకే రాష్ట్రం విద్యుత్ కష్టాలు ఎదుర్కొంటుందన్నారు. త్వరలో సమస్య పరిష్కారమవుతుందన్నారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు రెండు లక్షల మందికి ఉపాధి కల్పించామని, మరికొందరికి త్వరలో రాజీవ్ యువకిరణాల కింద ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తాము ధైర్యంగా వాటిని ఎదుర్కొంటామని పార్టీ సమావేశంలో బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో పార్టీ బలోపేతం కోసం అక్కడ ఇంచార్జులని నియమిస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+