అనుమానంతో మరదల్ని చంపి బావ ఆత్మహత్య

తన తమ్ముని భార్య అయిన లతకు వివాహేతర సంబంధం ఉన్నట్లు అనుమానించిన గంగాధర్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసును దర్యాఫ్తు చేస్తున్నారు.
రిటైర్డ్ ఏఐ మాధవ రెడ్డి హత్య
రిటైర్డ్ ఏఈ మాధవ రెడ్డిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. నల్గొండ జిల్లా ఎన్‌జి కళాశాల గ్రౌండ్స్‌లో ఆయన యోగా చేస్తుండగా కొందరు దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. భూతగాదాల నేపథ్యంలోనే మాదవ రెడ్డిని హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. ఇతను నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లెంల వాసి.
నగల కోసం హత్య
కరీంనగర్ జిల్లాలో ఓ మహిళను హత్య చేసి నగలను దోచుకెళ్లారు. జిల్లాలోని ధర్మారం మండలం కానంపల్లిలో శ్యామలమ్మ అనే అరవై అయిదేళ్ల మహిళ ఇంట్లోకి శనివారం రాత్రి కొందరు దుండగులు ప్రవేశించారు. ఆమె వద్ద ఉన్న నగలను ఇవ్వడానికి నిరాకరించడంతో ఆమెను కత్తితో దారుణంగా పొడిచి హత్య చేశారు. అనంతరం ఆమె మెడలోని 5 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications