ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై వేటు యోచనలో తెలుగుదేశం

ప్రవీణ్, అమర్నాథ్‌లు బాబు వైఖరిపై విరుచుకపడ్డారు. టిడిపి పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని, ఇందుకు బాబు నిర్ణయాలే కారణమని వారు ఆరోపించారు. 2009 నుండి బాబు తీసుకున్న నిర్ణయాలు సక్రమంగా లేవని, అందుకే ప్రజలను మెప్పించలేక పోయామన్నారు. బాబు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, దీంతో పార్టీలోని చాలామంది నేతలలో తీవ్రమైన అసంతృప్తి ఉందని వారు అన్నారు. బాబుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
దీంతో వారిపై వేటు వేయాలని చంద్రబాబును పలువురు నేతలు కోరుతున్నారట. ఇంత ఘాటుగా విమర్శిస్తున్నా విస్మరిస్తే మొదటికే మోసం వస్తుందని, కాబట్టి వారిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కోరుతున్నారట. వారిపై వేటు విషయంలో పార్టీలో చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో జగన్ వైపు వెళ్లిన ఎమ్మెల్యేలపై వెంటనే చర్యలు తీసుకోక పోవడంతో ఆ ప్రభావం పార్టీపై పడిందని చెబుతున్నారట.
అయితే ఆ తర్వాత వల్లభనేని వంశీకి నోటీసులు ఇవ్వడం, మైసూరా రెడ్డి, కొడాలి నాని, చిన్నం రామకోటయ్యపై తక్షణమే స్పందించడంతో అంతా సర్దుకుందని, ఇప్పుడు కూడా వెంటనే వారిపై చర్యలు తీసుకుంటేనే మంచిదని చెబుతున్నారట. ఇటీవల మైసూరా రెడ్డిపై పార్టీ క్షణాల్లో వేటు వేసింది. వేటుకు ముందు వారి నుండి వివరణ తీసుకోవాలని సూచిస్తున్నారట.
-
కనిపించిన నెలవంక.. దేశవ్యాప్తంగా "రంజాన్" వేడుకలకు వేళాయే !! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications