కిరణ్‌కు చిరంజీవివర్గం మంత్రి రామచంద్రయ్య రెండోలేఖ

రాష్ట్రంలో తీవ్రమైన విద్యుత్ కోత ఉందని, పవర్ కట్ వల్ల ఇటు రైతులు, అటు పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. పవర్ సమస్య పైన మంత్రివర్గంలో ప్రత్యేకంగా చర్చించాలని ఆయన తన లేఖలో కోరారు. విద్యుత్ కొరత ప్రభావం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పడుతోందన్నారు.
చాలా చిన్న తరహా పరిశ్రమలు మూసివేయబడుతున్నాయని అన్నారు. దీనివల్ల లక్షలమంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని తెలిపారు. కరెంట్ లేక పోవడంతో నీరు లేక పంటలు సరిగా పండకపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వెంటనే విద్యుత్ సమస్యను తీర్చి రైతులకు, చిన్న పరిశ్రమలకు, కార్మికులకు ఉపశమనం కలిగించాలని విజ్ఞప్తి చేశారు.
కెజి బేసిన్‌లో సంవృద్ధిగా గ్యాస్ ఉన్నా లభ్యత లేదన్నారు. నీటి విలువలు తగ్గిపోవడంతో విద్యుత్ సమస్య తలెత్తిందని, దీని ప్రభావం ఆర్థిక, వృద్ధి రంగాలపై పడుతోందన్నారు. పారిశ్రామిక రంగం పూర్తిగా దెబ్బతిన్నదన్నారు. కృష్ణా బేసిన్ ప్రాంతాల్లో నీటిమట్టాలు తగ్గుతున్నాయన్నారు. తెలంగాణ, సీమలో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు.
ఆయన తన లేఖలో పలు సూచనలు కూడా చేశారు. వ్యవసాయరంగానికి సోలార్ పవర్‌తో నడిచే పంపుసెట్లు ఇవ్వాలని సూచించారు. ఇండోనేషియా, ఇరాన్ నుండి ఎల్ఎన్‌జి గ్యాస్‌ను దిగుమతి చేసుకోవాలని కోరారు. విశాఖ తీరంలో ఎల్ఎన్‌జి రీ గ్యాసిఫికేషన్ యూనిట్‌ను ప్రారంభించాలని సూచన చేశారు.
తూగోలో పంట నష్టం
కాగా అల్పపీడనం కారణంగా భారీగా కురుస్తున్న వర్షాలకు తూర్పు గోదావరి జిల్లాలో తీవ్ర పంట నష్టం వాటిల్లింది. ఈ జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఏడువేల హెక్టార్ల వరి పంట, 110 హెక్టార్ల పత్తిపంట నీట మునిగింది రాజమండ్రిలో పదకొండు సెంటిమీటర్ల వర్షపాతం నమోదయింది.












Click it and Unblock the Notifications