రెండు రోజులు బాబుతో లోకేష్: కదం కలిపిన హరికృష్ణ

బాబుతో పాటు లోకేష్ పాదయాత్ర చేయనప్పటికీ రెండ్రోజులు ఆయనతో పాటు ఉంటారని సమాచారం. పాదయాత్రకు సంబంధించి ప్రత్యేకంగా తండ్రి అవసరాలను పర్యవేక్షించి.. ఇతరులకు సూచనలు ఇచ్చి ఆ తర్వాత అతను తిరిగి రానున్నారని తెలుస్తోంది. కాగా పాదయాత్ర సమయంలో లోకేష్ కొద్ది దూరం వెళ్లాక విరమించుకోవాలని చూడటంతో కార్యకర్తలు మరికొంత దూరం నడవాలని కోరారు. దీంతో ఆయన తన నడకను తండ్రితో పాటు కొనసాగించారు.
హరికృష్ణ మాత్రం కొద్దిసేపు నడిచి వెనుదిరిగారు. మరోవైపు బాబు ఆద్యంతం ఉల్లాసంగా కనిపించారు. పాదయాత్రలో బాబు తన రొటీన్ సీరియస్‌నెస్‌కు స్వస్తి చెప్పి అందరినీ ఆహ్లాదంగా పలకరించారు. కార్యకర్తలు, ప్రజల భుజాలపై చేయి వేసి పలకరించారు. పాదయాత్రకు హైదరాబాద్ నుంచి బయలు దేరింది మొదలు.. హిందూపురంలో పాదయాత్రలోనూ ఆయన ఆయన ఆహ్లాదంగా నవ్వుతూనే కనిపించారు.
చంద్రబాబు పాదయాత్ర విశేషాలను ఎప్పటికప్పుడు ఫేస్‌బుక్‌లో ఇవ్వనున్నామని టిడిపి ఐటీ విభాగం అధిపతి శ్రీనివాస రావు మంగళవారం తెలిపారు. యాత్రకు సంబంధించిన వార్తలు, ఫొటోలు, వీడియోలు, పాటలు, పోస్టర్ల వంటివి తాజా విశేషాలతో కలిపి ఇస్తున్నట్లు చెప్పారు. ఇవన్నీ పార్టీ వెబ్‌సైట్‌లో ఉంటాయన్నారు.












Click it and Unblock the Notifications